Advertisementt

‘పండుగాడి ఫోటో స్టూడియో’ పూర్తయింది

Wed 05th Jun 2019 05:11 PM
ali,pandugadi photo studio,movie,latest,update  ‘పండుగాడి ఫోటో స్టూడియో’ పూర్తయింది
Pandugadi Photo Studio Post Production Completed ‘పండుగాడి ఫోటో స్టూడియో’ పూర్తయింది
Advertisement
Ads by CJ

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘పండు గాడి ఫోటో స్టూడియో’

ఆలీ హీరోగా పెదరావురు ఫిలిం సిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా  ‘పండు గాడి ఫోటో స్టూడియో’. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో మా హీరో ఆలీ ఎవరికి ఫోటో తీస్తే వారికి పెళ్లి అయ్యి పోతుంది. ఈ చిత్రంలో పాత్రలు విలక్షణంగాను, నటీనటుల పేర్లు వైవిధ్యంగాను ఉంటాయి. పండుగాడు, కంచు కనకరత్నం, మిలట్రీ మావ, గొడుగు గోవిందం, చెంబులింగం, మెంటల్ లచ్చిమి, బేడార్దనాగాడు, వంటి వైవిధ్యమైన పేర్లు ఈ చిత్రంలో ఉంటాయి. అలాగే నూతన నటుడు సందీప్ రాజా, టీనా చౌదరి  ఈ చిత్రంలో విలక్షణ పాత్రలు పోషించారు.. అలాగే సంగీత దర్శకుడు యాజమాన్య సారథ్యంలో శ్రేయగోషల్, మనీషా చక్కని పాటలు పాడారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని జూన్ ఎండింగ్ లో రిలీజ్ చేయలనుకుంటున్నాం’’ అని అన్నారు.          

ఆలీ, రిషిత వినోదకుమార్, బాబుమోహన్, సుధ ,జీవ , శ్రీలక్ష్మీ రాంజగన్ నటించిన ఈ చిత్రానికి నిర్మాత: గుదిబండి వెంకట సాంబిరెడ్డి, సంగీతం: యాజమాన్య , ఎడిటర్: నందమూరి హరి, కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఫైట్స్: షా వాలిన్, మల్లేష్,  డాన్స్: రఘు మాస్టర్, అజయ్ శివశంకర్, అమ్మ సుదీర్, కధ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: దిలీప్ రాజా

Pandugadi Photo Studio Post Production Completed:

Pandugadi Photo Studio Movie Latest update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ