తెలుగు సినిమాని వర్మ ‘శివ’ చిత్రం ఎలా ఓ ఊపు ఊపి తన స్థానం నిలబెట్టుకుందో కల్ట్ సినిమాల విషయంలో మోడ్రన్ క్లాసిక్‌గా వచ్చిన ‘అర్జున్‌రెడ్డి’ కూడా అంతే సంచలనం సృష్టించింది. నాడు తెలుగులో ‘శివ’ తర్వాత మరలా ‘శివ’ని వర్మనే బాలీవుడ్‌లో తీసిన విధంగా ఈ చిత్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కూడా ప్రస్తుతం బాలీవుడ్‌లోకి ‘అర్జున్‌రెడ్డి’ని రీమేక్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ మూవీపై నార్త్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. మరి ఈ చిత్రం తర్వాత సందీప్‌రెడ్డి వంగా చేయబోయే చిత్రం ఏమిటి? అనే దానిపై క్లారిటీ లేదు.
ఆమధ్య ముంబై వెళ్లి వర్మకి తన తదుపరి చిత్రం కథను చెప్పడం, దానికి వర్మ ఈ చిత్రం సందీప్‌రెడ్డి తీస్తే దాని ముందు అర్జున్‌రెడ్డి ఓ సాధారణ చిత్రంగా మిగిలిపోతుందని ప్రశంసలు ఇచ్చాడు. ఇక కారు మెకానిక్‌గా హీరో నటించే ఓ క్రైమ్ స్టోరీని ఆయన మహేష్‌బాబుకి వినిపించాడని అంటున్నారు. ప్రస్తుతానికి మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బిజీ కానున్నాడు. అంతలోపు సందీప్‌రెడ్డి ఫుల్ స్క్రిప్ట్‌తో మహేష్‌ని మెప్పిస్తాడా? లేదా? అనేది చూడాలి. ఒక వేళ మహేష్ నో చెప్పినా ఎందరో హీరోలు సందీప్‌రెడ్డితో చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు.
ముఖ్యంగా అర్జున్‌రెడ్డి హీరో విజయ్ దేవరకొండ, సందీప్‌రెడ్డి వంగాతో మరో చిత్రం చేయాలని భావిస్తున్నాడు. కానీ ఆయన చేతిలో బోలెడు చిత్రాలు ఉన్నాయి. సో.. విజయ్‌తో చేయాలన్నా కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి తాను ఓ క్రైమ్ స్టోరీని తయారు చేసుకున్నానని, అది పాన్ ఇండియా మూవీలా, కెజీఎఫ్ తరహాలో ఉంటుందని సందీప్‌రెడ్డి ఊరిస్తున్నాడు. చూద్దాం.. సందీప్‌రెడ్డితో చేయబోయే హీరో ఎవరు? ఆయనకి కూడా అదృష్టం తలుపు తడుతుందా? అనేవి వేచిచూడాల్సివుంది...!