టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలానే ఈ వీక్ కూడా మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే కొంచెం వెరైటీ ఏటంటే బుధవారం ఒకటి, గురువారం ఒకటి, శుక్రవారం ఒకటి అలా రోజుకో సినిమా రిలీజ్ అవుతోంది.
మొదటి రంజాన్ సందర్భంగా బుధవారం రోజున సెవెన్ అనే సినిమా వస్తోంది. ఇందులో హవీష్ ప్రధాన పాత్రలో నటించారు. అలానే ఇందులో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు. మెయిన్ హీరోయిన్ మాత్రం రెజీనా. దీనిపై మేకర్స్ మంచి అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈసినిమాపై ప్రేక్షుకులు కూడా ఇంట్రెస్ట్ చూపే అవకాశముంది. ఈ మూవీతో పాటు బాలీవుడ్ మూవీ భరత్ కూడా రిలీజ్ అవుతుంది.
సెవెన్ విడుదలైన 24 గంటల్లోనే హిప్పీ వస్తోంది. ఆర్ఎక్స్100 కార్తికేయ నటించిన రెండో సినిమాగా ఈమూవీ మనముందుకు రానుంది. ఇది తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. కార్తికేయ లుక్స్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. హీరోయిన్స్ గా దిగాంగన, జజ్బా సింగ్ నటించారు.
ఈ మూడు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ మూవీ కిల్లర్ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతోంది. తమిళ నటుడు విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ఈమూవీలో విజయ్ తో పాటు సీనియర్ యాక్టర్, యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఉన్నాడు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటాయని చెబుతున్నారు. ఈసినిమాలో ఏది సక్సెస్ అవుతుందో మరికొన్ని గంటల్లో తెలిసిపోనుంది.