Advertisementt

నాగ‌శౌర్య - ఐరా క్రియేష‌న్స్ మూవీ అప్‌డేట్!

Tue 04th Jun 2019 08:17 PM
naga shourya,ira creations,movie,latest,update  నాగ‌శౌర్య - ఐరా క్రియేష‌న్స్ మూవీ అప్‌డేట్!
Naga Shourya and Ira Creations Movie Latest Update నాగ‌శౌర్య - ఐరా క్రియేష‌న్స్ మూవీ అప్‌డేట్!
Advertisement
Ads by CJ

జూన్ 8నుండి వైజాగ్ లో  నాగ‌శౌర్య - ఐరా క్రియేష‌న్స్ చిత్రం రెండ‌వ షెడ్యూల్‌ 

ఛ‌లో లాంటి చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌స్తున్న చిత్రం ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది.. జూన్ 8 నుండి వైజాగ్ లో రెండ‌వ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ఈ  చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్ర స‌మ‌ర్ప‌కుడు శంక‌ర్ ప్ర‌సాద్, లైన్‌ ప్రోడ్యూస‌ర్ బుజ్జి లు చిత్ర యూనిట్ కి విశాఖ‌ప‌ట్నంలో షూటింగ్ కి కావ‌ల‌సిన అన్ని ఏర్పాట్లు ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. నిర్మాత  ఉషాముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ  విజ‌న్  త‌గ్గ‌ట్టుగా భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిచ‌నున్నారు. ఐరా క్రియేష‌న్స్ హస్పిటాలిటికి కేరాఫ్ అడ్రాస్ గా టాలీవుడ్ లో పేరుంది దానికి త‌గ్గ‌ట్టుగానే వారి ప్రేమానురాగాలు యూనిట్ మెత్తం మీద చూపిస్తారు. మండే ఎండ‌లు పోయి రుతుప‌వ‌నాలు మొద‌ల‌వుతున్న జూన్ 8 నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ‌మ‌వ‌టం శుభ‌సూచ‌కం. ఈ చిత్రంలో నాగ‌శౌర్యకి జంట‌గా మెహ్రీన్ నటిస్తుంది.  

నిర్మాత‌లు మాట్లాడుతూ.. ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని చాలా నిజాయితిగా నిర్మించాము. అంతే నిజాయితిగా అఖండ విజ‌యం అందించారు. మా బ్యాన‌ర్ లో చిత్రాలు అన్ని ప్రేక్ష‌కుడుని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తాము... ఛ‌లో మంచి ప్రేమ‌క‌థ‌, న‌ర్త‌న‌శాల మంచి కామెడి చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. అదే విధంగా నాగ‌శౌర్య న‌టించే ప్రొడ‌క్ష‌న్ నెం 3 చిత్రం షూటింగ్ మొద‌టి షెడ్యూల్ పూర్త‌యింది. జూన్ 8 నుండి విశాఖ‌ప‌ట్నంలో యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తారు. హీరో నాగ‌శౌర్య రాసిన క‌థ‌కి ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌తేజ ప్రాణం పోస్తున్నాడు. కెమెరామెన్ మనోజ్ రెడ్డి ప్ర‌తి ఫ్రేమ్ ని చాలా అందంగా అర్థ‌వంతంగా షూట్ చేస్తున్నాడు. మెహ్రీన్ హీరోయిన్ గా మ‌రోక్క‌సారి ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందుతుంది. అని అన్నారు

పోసానికృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, ర‌మ‌ణ‌, వి.జ‌య‌ప్రకాష్‌, కిషోర్‌, ఎం.ఎస్‌. భాస్క‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి  మ్యూజిక్: శ్రీ‌చ‌ర‌ణ్‌, కెమెరా: మ‌నోజ్‌రెడ్డి, ఎడిట‌ర్‌గారీబిహెచ్‌, ఆర్ట్‌డైరెక్ట‌ర్: కిర‌ణ్‌కుమార్ మ‌న్నే, కొరియోగ్రాఫర్: ర‌ఘుమాస్ట‌ర్‌, స్టోరీ: నాగ‌శౌర్య‌, స్ర్కీన్‌ప్లే: ర‌మ‌ణతేజ‌, ఫ‌ణీంద్ర‌బిక్కిన‌, డైరెక్ష‌న్: ర‌మ‌ణ్‌తేజ‌, ప్రొడ్యూస‌ర్: ఉషాముల్పూరి, పిఆర్ ఓ: ఏలూరుశ్రీ‌ను.

Naga Shourya and Ira Creations Movie Latest Update:

Ira Creations New Movie Shooting Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ