త్వరలోనే సాయి ధరమ్ తేజ్.. మారుతీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని గీత ఆర్ట్స్ వారు నిర్మించనున్నారు. వరస ఫ్లాపులతో సాయి ధరమ్ తేజ్ మార్కెట్ డౌన్ అయింది. ఒకప్పుడు తేజు సినిమాలు 20 కోట్లు వరకు బిజినెస్ చేశాయేమో కానీ ఇప్పుడు మనోడి పరిస్థితి అలా లేదు.
హిట్ అని ప్రచారం చేసిన చిత్రలహరి సినిమాకే 14 కోట్లు షేర్ వచ్చిందంటే ఆలోచించవచ్చు మనోడి మార్కెట్ ఎంతలా పడిపోయిందో అని. ఈ తరుణంలో మెగా మేనల్లుడి కొత్త సినిమా మీద ఏకంగా పాతిక కోట్లు పెడుతున్నారట ఈ నిర్మాతలు. మారుతీ ఉన్నాడులే అనుకుంటే అతనికి మార్కెట్ లేదు. తన లాస్ట్ టు మూవీస్ శైలజారెడ్డి అల్లుడు, బాబు బంగారం యావరేజ్ టాకే తెచ్చుకున్నాయి.
మరి ఇంత బడ్జెట్ అంటే రిస్క్ అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఒకవేళ నిజంగానే ఈమూవీకి 25 వరకు ఖర్చయితే దానిని ఎంతకు అమ్ముతారు? శాటిలైట్ అండ్ ఇతర రైట్లు ఒక 5 కోట్లు వచ్చినా, సినిమాను 20 కోట్లకు అమ్మాలి. మరి ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి. ఈమూవీ సూపర్ హిట్ అయితే తప్ప తేజుకి ఈ కలెక్షన్స్ రావు.