వరస ప్లాప్స్ తో సతమతమవుతున్న నితిన్ శ్రీనివాస కళ్యాణం ప్లాప్ తర్వాత ఆచి తూచి సినిమా మొదలెట్టబోతున్నాడు. ఛలో హిట్ కొట్టిన వెంకీ కుడుములతో భీష్మ సినిమాని కొన్ని నెలల ముందే అనౌన్స్ చేసాడు నితిన్. కానీ పక్కా స్క్రిప్ట్ టోన్ పట్టాలెక్కించాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఆ సినిమా పట్టాలెక్కడానికి లేట్ అవుతూ వచ్చింది. ఇక ఈ సినిమా కోసం వెంకీ కుడుములు హిట్ డైరెక్టర్ అయితే... హీరోయిన్ గా సూపర్ క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న కావడం నితిన్ కి కలిసొచ్చింది. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న రష్మికతో, నితిన్ జోడి కట్టడం నిజంగా సినిమాకి బోలెడంత హైప్ వస్తుంది. ప్రస్తుతం మహేష్ తో సినిమా చేస్తున్న రష్మిక, నితిన్ సరసన కూడా నటిస్తే అది నితిన్ కే కలిసొస్తుంది.
మరో పక్క వెంకీ అట్లూరితో, నితిన్ మరో సినిమాని పట్టాలెక్కించనున్నాడు. మిస్టర్ మజ్నుతో ప్లాప్ కొట్టిన వెంకీ అట్లూరి, నితిన్ కోసం ఒక లవ్ స్టోరీ ప్రిపేర్ చేసి నితిన్ ని ఒప్పించాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మహానటి సావిత్రితో భారీ క్రేజ్ సంపాదించిన కీర్తి సురేష్ నటించబోతుంది. మహానటి తరవాత పెద్దగా హిట్స్ లేకపోయినా.. కీర్తి క్రేజ్ మహానటితో అలానే ఉంది. అందుకే కీర్తి సురేష్ తో జోడి కడితే నితిన్ కి కలిసొస్తుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ బాలీవుడ్ లో సినిమా చేస్తుంది. మరి అలాంటి హీరోయిన్ తో నితిన్ నటిస్తే నితిన్ కి క్రేజ్ రావడం ఖాయం కదా..! ఎలాగూ అ...ఆ.. సినిమాలో సమంతతో కలిసి నటిస్తే ఆ సినిమా హిట్ తో నితిన్ కూడా మంచి పేరొచ్చింది.