Advertisementt

కొరటాల ఓకే.. సుకుమార్ పరిస్థితే..!

Tue 04th Jun 2019 07:45 PM
koratala shiva,chiranjeevi,movie starts,sukumar,dilemma  కొరటాల ఓకే.. సుకుమార్ పరిస్థితే..!
Koratala Ok.. but Sukumar In Doubts కొరటాల ఓకే.. సుకుమార్ పరిస్థితే..!
Advertisement
Ads by CJ

గత ఏడాది ఇద్దరు టాప్ మోస్ట్ డైరెక్టర్స్ తమ తమ సినిమాలతో ఒక నెల అటు ఇటుగా ప్రేక్షకుల ముందుకు రావడం ఆ సినిమాలతో ఆ డైరెక్టర్స్ హిట్ అందుకోవడం జరిగింది. ఆ డైరెక్టర్స్ ఎవరంటే ఒకరు సుకుమార్. మరొకరు కొరటాల. సుకుమార్ రంగస్థలంతో బ్లాక్ బస్టర్ అందుకుంటే.... కొరటాల భరత్ అనే నేనుతో జస్ట్ హిట్ కొట్టాడు. అయితే గత ఏడాది నుండి ఈ ఇద్దరు డైరెక్టర్స్ ఖాళీగానే ఉన్నారు. ఇక కొరటాల శివ, చిరంజీవితో సినిమా కమిట్ అయితే సుకుమార్, మహేష్ కి కమిట్ అవడము.. అది క్యాన్సిల్ అవడము జరిగింది. ఇక సుకుమార్ మళ్ళీ అల్లు అర్జున్ తో మరో సినిమా అంటూ ప్రకటించాడు.

శ్రీమంతుడు, మిర్చి, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను తో టాప్ లిస్ట్ లో చేరిన కొరటాల శివ ఇప్పుడు మెగాస్టార్ చిరుతో సినిమా చెయ్యబోతున్నాడు. కొరటాల - చిరు కాంబో మూవీ ఆగష్టు నుండి పట్టాలెక్కబోతుందంటూ ప్రచారం జోరుగా జరిగింది. మరి కొరటాల గతఏడాది నుండి చిరు స్క్రిప్ట్ మీద కూర్చుని చివరికి ఆ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. కానీ సుకుమార్ బ్లాక్ బస్టర్ కొట్టినా... ఆయనకు సినిమాలిచ్చే హీరోలు కనబడ్డం లేదు. మహేష్ సినిమా క్యాన్సిల్ అయినా.. అల్లు అర్జున్ అవకాశమిచ్చాడు. 

కానీ అల్లు అర్జున్ తో తన సినిమా ఎప్పుడు మొదలవుతుందో సుకుమార్ కే క్లారిటీ లేదు. ఎందుకంటే అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సినిమాతో పాటుగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ కూడా చెయ్యబోతున్నాడు. మరా సినిమాలు ఫినిష్ అవ్వాలి సుకుమార్ కి ఛాన్స్ రావాలి. గత ఏడాది మంచి హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ లో కొరటాల అలా అయితే సుకుమార్ ఇలా...ఉన్నాడు.

Koratala Ok.. but Sukumar In Doubts:

Koratala and Chiranjeevi Movie Starts from Aug 22.. But Sukumar in Dilemma

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ