బాహబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా సాహో రూపొందుతోంది. దాదాపు 250కోట్లకి పైగా బడ్జెట్‌తో రూపొందుతూ... టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లను టార్గెట్ చేస్తూ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు15న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ప్రమోషన్స్ షురూ చేసే సమయంలో ఈ ప్రాజెక్ట్ నుంచి సంగీత దర్శకత్రయం శంకర్-ఎహసాన్-లాయ్‌లు తప్పుకున్నారు. మరి ఆ స్థానంలో ఎవరు సంగీతం అందించనున్నారు? అనే విషయంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
థమన్, జీబ్రాన్‌ల పేర్లు బయటకు వచ్చాయి. బాలీవుడ్‌ని కూడా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఈ సంగీత దర్శకులు హఠాత్తుగా తప్పుకోవడం మైనసే అవుతుంది. అదే జిబ్రాన్ అయితే కోలీవుఢ్‌లో మరింత అంచనాలు పెరుగుతాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లను టార్గెట్ చేసే ఉద్దేశ్యంతోనే ఈ మూడు భాషల వారినే నటీనటులుగా ఎంచుకున్నారు.
ఇక ఈ చిత్రం టీజర్‌ని రంజాన్ కానుకగా విడుదల చేసి సల్మాన్ నటిస్తూ 5వ తేదీన విడుదల కానున్నభారత్ విడుదల అయ్యే థియేటర్లలో ప్రదర్శించనున్నారు. కొన్ని సెకన్ల పాటు ఉండే టీజర్ కోసం ఏకంగా 15లక్షలు ఖర్చు చేసి ఓ అద్భుతమైన హాలీవుడ్ మ్యూజికల్ బైట్ ని రాయల్టీ కిందకు తీసుకున్నారట. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ కోసం ఇలా చేయనున్నారు. ఇక ఈ టీజర్ విడుదల తర్వాత ఈ చిత్రం రేంజ్, బిజినెస్ పీక్స్‌కి వెళ్లడం గ్యారంటీ అనే చెప్పాలి.