కొన్ని వర్గాల ప్రేక్షకులు కొందరికి అభిమానులు అవుతారు. కానీ అందరిని మెప్పించి, అందరి ఆదరణ పొందే అందరివాడు అనిపించుకోవడం కష్టం. కానీ ఇలా అందరివాడు అనిపించుకునే వారిలో పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణయమూర్తి ఉంటాడు. నాటి ఎర్ర హీరో మాదాల రంగారావు, టి.కృష్ణ వంటి వారు లేని లోటుని భర్తీ చేస్తూ అర్ధరాత్రి స్వాతంత్య్రం, చీమలదండు, ఎర్రసైన్యం, దండోరా వంటి వరస 15కి పైగా హిట్స్ ఇచ్చాడు. వీటి ద్వారా వచ్చిన లాభాలను మరలా అలాంటి చిత్రాల కోసమే ఖర్చుపెట్టాడు. కానీ ఈమధ్య ఆయన నటించిన చిత్రాలు సరిగా ఆడలేదు. అయినా ఆయన జంకడం లేదు ప్రస్తుతం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ చిత్రం తీస్తున్నాడు. దీని కోసం ఎన్నడు లేని విధంగా మెగాస్టార్ చిరంజీవిని వేడుకకు ఆహ్వానించాడు.
ఇక ఈయన ఊ అంటే చాలు ఆయన అడిగిన పారితోషికం ఇచ్చి బయటి చిత్రాలలో చాన్స్‌లు వస్తాయి. దీనికి ఒకే ఉదాహరణ పూరీజగన్నాథ్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన టెంపర్ చిత్రం. అందులో పోసాని పాత్రను ఆర్.నారాయణమూర్తి స్ఫూర్తితోనే రాసి ఆయన్నే నటించమంటే నో చెప్పాడు. ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి. చిరంజీవి, శివాజీరాజా వంటి వారు కూడా మీ కోరికేమిటంటే ఆర్.నారాయణమూర్తిని మాకారులో ఎక్కించుకోవాలని అని చెప్పేవారు. ప్రసాద్ ల్యాబ్స్‌లోనే ఉంటూ ఈయన ఆటోలలో ప్రయాణం చేస్తాడు.
ఇక ఈయన కేవలం ఎర్రోడు, రిక్షావోడు, హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య వంటి బయటి చిత్రాలలో మాత్రమే నటించాడు. ఇక రాజశేఖర్‌రెడ్డి హయాంలో హైదరాబాద్‌లో సొంత ఇల్లు, వైజాగ్‌లో 10 ఎకరాల భూమిని ఆఫర్ చేసినా ఆయన నో చెప్పాడు. కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇస్తానంటే కూడా నో చెప్పాడు. ఇక ఈయనకు రాజకీయంగా కూడా పలు ఆఫర్లు వచ్చాయి. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తరపున కాకినాడ సీటుని ఆఫర్ చేశాడట. తర్వాత చిరంజీవి సైతం ప్రజారాజ్యం సమయంలో ఆయనకి టిక్కెట్ ఇస్తానన్నా నో చెప్పాడు. ఇటీవల వైసీపీ ఆయనకు తుని నుంచి పోటీ చేసే ఆఫర్ ఇచ్చినా నో చెప్పాడు. ఇప్పటికీ ఆయనేదైనా దూర ప్రదేశాలకు వెళ్లితే చిన్న డబ్బాలో తినుబండారాలు తీసుకుని వాటిని రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో ఎలాంటి భేషజాలు లేకుండా సామాన్యునిలా భోజనం చేస్తాడు.