బహుశా బాహుబలి రెండు పార్ట్‌ల కోసం ఏళ్లకు ఏళ్లు పనిచేయడం ప్రభాస్‌కే చెల్లింది. అదే సమయంలో ఆయన అనుకుని ఉంటే నాలుగైదు చిత్రాలు చేసేవాడు. కానీ బాహుబలిపై, రాజమౌళిపై ఉన్ననమ్మకం ఆయన్ని అలా చేయించింది. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. యూవి క్రియేషన్స్ బేనర్‌లో సుజీత్ దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాల రీతిలో సాహో రూపొందుతోంది. ఇందులో ఆయన చేసే ఫీట్లు విందు చేయనున్నాయని, ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ చిత్రం ఇదేనని తెలుస్తోంది.
దీనిని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు15న విడుదల చేయనున్నారు. దీంతో పాటు ప్రభాస్, జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో పూజాహెగ్డే హిరోయిన్‌గా పీరియాడికల్ లవ్‌స్టోరీగా ‘జాన్’( వర్కింగ్‌టైటిల్)రూపొందుతోంది. ఈ మూవీని యువి క్రియేషన్స్, తమ సొంత పెదనాన్నకృష్ణంరాజు బేనర్ అయిన గోపీకృష్ణా మూవీస్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని వచ్చేసంక్రాంతి రేసులోకి దింపాలని మొదట భావిస్తూ వస్తున్నారు. ‘సాహో’ ఆగష్టు15న విడుదలైతే అతి తక్కువ వ్యవధిలోనే రెండో చిత్రం విడుదల చేయకుండా వచ్చే వేసవికి జిల్‌రాధాకృష్ణ సినిమాని విడుదల చేయాలని అనుకుంటున్నారట.
ఎందుకంటే ప్రభాస్ బాహుబలి తర్వాత ఈ రెండు చిత్రాలకు మాత్రమే ఓకే చెప్పాడు. ఇదే సమయంలో మరో రెండు సినిమాలు డిస్కషన్స్‌లో ఉన్నాయట కాబట్టి ‘సాహో’తో పాటు ‘జాన్’ని వెంట వెంటనే విడుదల చేస్తే మరలా ప్రభాస్‌కి మరో సినిమా వచ్చేందుకు భారీ గ్యాప్ రావడం ఖాయం. అందుకే తదుపరి రెండు చిత్రాలను లైన్‌లోకి తెచ్చి, సమ్మర్ కానుకగా ‘జాన్’ మూవీని విడుదల చేసే అవకాశం ఉంది.