తెలుగులో హీరోగా వరుస చిత్రాలు చేయడం, అన్నపూర్ణ బేనర్‌లో సినిమాలను నిర్మించడం, కుమారులైన నాగచైతన్య, అఖిల్ కెరీర్‌ని ప్లాన్ చేయడం, కోడలు సమంతకి గైడ్‌గా ఉండటం... ఇంకా పలువ్యాపారాలు సైతం చేస్తోన్న కింగ్‌ని చూస్తే అష్టావధాని, శతావధానిలు గుర్తుకు రాక మానరు. గతంలో ఆయన శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఓ చిత్రంలో ఇష్టపడి మరీ ఓ ప్రత్యేక పాత్రను చేశాడు. కానీ మోహన్‌బాబు నటించిన అధినేత, మంచు విష్ణు కృష్ణార్జునులు చిత్రాలను మాత్రం మొహమాటం కోసం ఒప్పుకున్నట్లు తెలిపాడు. ఏది ఏమైనా సినిమాలను కూడా బిజినెస్‌లా చూసే పక్కా బిజినెస్ మైండ్ నాగ్‌ది.
ఇక విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం తన హోం బేనర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిలసౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తన కెరీర్‌లోనే క్లాసిక్ హిట్ అయిన మన్మథుడుకి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ చేస్తున్నాడు. జూలైలో విడుదల చేసే దిశగా ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. నాగార్జున సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తోన్న ఇందులో కీర్తిసురేష్, కోడలు సమంతలు కామియో పాత్రలు చేస్తున్నారు. ఇటీవలే సమంతకి చెందిన పది పదిహేను నిమిషాల నిడివి కలిగిన పాత్రను పోర్చుగల్‌లో పూర్తి చేశారు. ఈ పాత్రకి గాను రెమ్యూనరేషన్ ఏమీ వద్దని, అందునా అది తమ సొంత అన్నపూర్ణ బేనర్ కాబట్టి తాను పైసా కూడా తీసుకోనని చెప్పి సమంత చెప్పిందట.
కానీ నాగ్ మాత్రం పర్సనల్ లైఫ్ పర్సనలే.. ఫ్రొఫెషనల్ లైఫ్ సపరేటు. రెంటికి ముడి పెట్టడం సరికాదని చెప్పి సమంతకి ఉన్న డిమాండ్ దృష్ట్యా 35లక్షల పారితోషికం ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో సమంత మెయిన్ హీరోయిన్‌గా రెండు నుంచి మూడుకోట్లు తీసుకుంటోంది. ఆ లెక్కన 10, 15 నిమిషాల పాత్రకు 35లక్షల రెమ్యూనరేషన్ అంటే మంచి మొత్తమేనని చెప్పాలి.
భవిష్యత్తులో నాగార్జున చెప్పిన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ వేరు వేరు అనే సిద్దాంతం నాగచైతన్య, సమంతలకి కూడా ఓ పాఠంలా మారుతుందనే చెప్పాలి.