Advertisementt

ఇప్పుడు మెహ్రీన్ మేనేజర్ ఎవరో తెల్సా?

Tue 04th Jun 2019 12:49 PM
mehreen pirzada,mother,takes,managing charges  ఇప్పుడు మెహ్రీన్ మేనేజర్ ఎవరో తెల్సా?
who is Mehreen Pirzada Manager? ఇప్పుడు మెహ్రీన్ మేనేజర్ ఎవరో తెల్సా?
Advertisement
Ads by CJ

సౌత్ హీరోయిన్స్ లో అమ్మ‌కూచీలు ఎక్కువ మందే ఉన్నారు. సౌత్ లో ఏంటి నార్త్ లో కూడా చాలామంది ఉన్నారు. మమ్మీ లేకుండా షూటింగ్ కి రాకపోవడం... తమకు ఏమి కావాలన్నా మమ్మీ పర్మిషన్ అడగడం.. అమ్మ ఆమోద ముద్ర ప‌డ‌క‌పోతే సినిమాలు చేయక పోవడం ఇటువంటివి చాలానే ఉన్నాయి.

అలాంటి వాళ్ల‌లో మెహ్రీన్ కూడా చేరిపోయింది. రీసెంట్ గా ఎఫ్ 2 చిత్రంతో హిట్ అందుకుని ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు దక్కించుకుంటున్న మెహ్రీన్ విషయంలో మమ్మీ జోక్యం ఎక్కువైపోతోంద‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మెహ్రీన్ రీసెంట్ గా తన మేనేజర్ ని తీసేసింది.

ఇప్పుడు తన డేట్స్ చూడాలన్న, కథలు వినాలన్నా... డేట్లు స‌ర్దుబాటు చేయాల‌న్నా, పారితోషికం తీసుకోవాలన్న అన్ని మమ్మీనే డిసైడ్ చేస్తోంద‌ని స‌మాచారం. సెట్స్ లో కూడా మెహ్రీన్ మమ్మీ జోక్యం ఎక్కువ అయిపోయిందని... మెహ్రీన్ మ‌రీ అతిగా ఆధార‌ప‌డిపోతుంద‌ని చెవులు కొరికేసుకుంటున్నారు. ఈమె ప్రస్తుతం నాగశౌర్యతో ఓ సినిమా చేస్తుంది. ఈమూవీ కోసం ఈమె ఏకంగా 80 ల‌క్ష‌ల పారితోషికం అందుకుంటోంది.

who is Mehreen Pirzada Manager?:

Mehreen Pirzada Mother Takes her Managing Charges

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ