Advertisementt

ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితేనే..: రెహమాన్!

Mon 03rd Jun 2019 08:09 PM
actor rehman,7 movie,important role  ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితేనే..: రెహమాన్!
Actor Rehman about 7 Movie Role ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితేనే..: రెహమాన్!
Advertisement
Ads by CJ

తెలుగు ప్రేక్షకులకు రెహమాన్ తెలిసిన నటుడే..ఇటీవలె  ‘డి 16’ సినిమాతో సోలోగా భారీగా హిట్ ను అందుకున్నాడు.

దాదాపు 30సం.లుగా సౌత్ లోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ, అన్నీ తరహా పాత్రలు పోషించగల ఆల్ రౌండర్ గా రెహమాన్ గుర్తింపు సాధించారు. ప్రస్తుతం సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తోన్న ఆయన 7 సినిమాతో మరోమారు తెరమీద కనిపించనున్నారు.

హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్, రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్స్ బేనర్లో రమేష్ వర్మ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘సెవెన్’. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రెహమాన్ ముఖ్యపాత్రలో నటించారు. కాగా ఆయన నటించిన ‘వైరస్’ అనే సినిమా మలయాళంలో ఈనెల 7 న రిలీజ్ అవుతుండగా ‘సెవెన్’ తెలుగులో 5 న రిలీజ్ అవుతుండడం విశేషం. విలక్షణ నటుడిగా  రహమాన్  సెవెన్ సినిమాలో కీ రోల్ లో కన్పించనున్నాడు. సెవెన్ తన కెరీర్ లో చేసిన ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. నా పాత్ర సినిమాలో కీలకం. ఇలా ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేయటానికే  నేను ఎప్పుడు సిద్దమేనంటున్నారు రెహమాన్.

Actor Rehman about 7 Movie Role:

Actor Rehman wants Important Roles

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ