Advertisementt

ఫ్యాన్స్ కోసం దుమ్మురేపేలా ‘సాహో’ టీజర్..!

Mon 03rd Jun 2019 07:55 PM
saaho teaser,hollywood,music byte,prabhas,sujith,saaho movie,bharat movie  ఫ్యాన్స్ కోసం దుమ్మురేపేలా ‘సాహో’ టీజర్..!
Saaho Teaser.. Latest Update ఫ్యాన్స్ కోసం దుమ్మురేపేలా ‘సాహో’ టీజర్..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సాహో’. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా యొక్క షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోవడంతో ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టారు మేకర్స్. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఈ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ప్రభాస్, సుజీత్.. ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సాహో టీజర్‌ని నభూతోనభవిష్యతి అన్న తీరుగా తీర్చిదిద్దనున్నారట. హాలీవుడ్ మూవీలా అనిపించేటట్టు టీజర్‌ను కట్ చేస్తున్నారట. అందుకోసం ఏకంగా రూ.15 లక్షలు ఖర్చు చేసి ఓ అద్భుతమైన ‘హాలీవుడ్ మ్యూజిక్ బైట్’ రాయల్టీ హక్కుల్ని చేజిక్కించుకున్నారట. 

టీజర్ కోసం వేరొక సంగీత దర్శకుడిని సంప్రదించారు కానీ క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీపడకూడదని ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని తెలిసింది. 300 కోట్లు ఖర్చు చేసి సినిమా తీస్తున్నప్పుడు టీజర్ ఎలా ఉండాలి? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ టీజర్‌ను ‘భారత్’ సినిమా ఆడే థియేటర్లలో ప్లే అయ్యేటట్టు ప్లాన్ చేసారు. సాహో టీజర్‌‌ని సల్మాన్ భాయ్ సినిమాతో రిలీజ్ చేసి మైలేజ్ పెంచాలని చూస్తున్నారు. జూన్ 5న ‘భారత్’తో పాటు సాహూ టీజర్ రిలీజ్ కానుంది.

Saaho Teaser.. Latest Update:

Hollywood Music Byte for Saaho Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ