Advertisementt

ఇప్పుడు రకుల్ ప్రీత్ పరిస్థితి ఏంటి?

Sun 02nd Jun 2019 07:44 PM
rakul preet singh,ngk movie,suriya,flop  ఇప్పుడు రకుల్ ప్రీత్ పరిస్థితి ఏంటి?
Rakul Preet Singh Gets One More Flop ఇప్పుడు రకుల్ ప్రీత్ పరిస్థితి ఏంటి?
Advertisement
Ads by CJ

రకుల్ ప్రీత్ స్పైడర్ ప్లాప్ తో ప్లాప్స్ కొట్టడం మొదలెట్టింది. వరసగా ప్లాప్స్ కొడుతూనే ఉంది. సౌత్ లో భారీ క్రేజ్ తో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఒకప్పుడు మూడు నాలుగు సినిమాలు చేస్తూ నిద్రకు కరువైన రకుల్ ప్రీత్... నేడు కంటి నిండా నిద్రకు కరువైంది. కారణం ప్లాప్స్. అటు హిందీలో ఓకే అనిపించుకున్న రకుల్ ఇటు సౌత్ లో మాత్రం ప్లాప్స్ పరంపర కొనసాగిస్తూనే ఉంది. స్పైడర్, దేవ్, నిన్నవచ్చిన ఎన్జీకే కూడా రకుల్ కి గట్టి షాక్ ఇచ్చింది. సాయి పల్లవి ఫస్ట్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సెకండ్ హీరోయిన్ గా వచ్చిన ఎన్జీకే ఎలాంటి ప్లాపో చూసాం.

అసలు ఎన్జీకేలో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్ర చేసిన రకుల్ స్థాయి ఎంతెలా దిగజారిందో చెప్పొచ్చు.  ఎన్జీకే సినిమా మొదలైనప్పుడు రకుల్ ఊపు చూస్తే రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ సినిమాలో బలంగా ఉందనుకుంటారు. కానీ చివరికి వచ్చేసరికి రకుల్ క్యారెక్టర్ ని దర్శకుడు సెల్వ రాఘవన్ తేల్చేసాడు. ఉన్న కాసేపు రకుల్ హావభావాలతో మెప్పించింది. కానీ తన పాత్ర ప్రాధాన్యం చూసాక... ఈమధ్యన రకుల్ సినిమా ఛాన్స్ వస్తే చాలు.. కథ ఎలాగున్నా పర్వాలేదు ఒప్పేసుకుంటుంది అని అనుకునేలా ఉంది. మరి ఒకప్పుడు ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలు చేసిన రకుల్ నేడు సీనియర్ హీరో నాగార్జునతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పాపం రకుల్.

Rakul Preet Singh Gets One More Flop:

No importance to Rakul Role in NGK

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ