మహేష్‌బాబు 26వ చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ 75వ జన్మదినం సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్‌తో సినిమా ముహూర్తం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కూడా మహర్షిలానే మూడు సంస్థలు కలిపి నిర్మిస్తున్నాయి. అనిల్‌సుంకర, దిల్‌రాజులతో పాటు మహేష్ సోదరుడు రమేష్‌బాబు కూడా దీనిలో భాగస్వామి. టైటిల్‌గా అత్తారింటికి దారేది తరహాలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ అని టైటిల్ పెట్టారు. టైటిల్ వెంటనే ఆకట్టుకొనేంత పవర్‌ఫుల్‌గా లేకపోయినా సినిమా విడుదల నాటికి ‘సరిలేరు నీకెవ్వరు మహేష్’ అనిపించేలా వస్తుంది.
ఇక అత్తారింటికి దారేదిలో నదియా పాత్రలాగా ఇందులో దాదాపు 13ఏళ్ల గ్యాప్ తర్వాత కీలకపాత్రను విజయశాంతి పోషిస్తోంది. విజయశాంతి అడవి చుక్క, వైజయంతి, సాహసబాలుడు-విచిత్రకోతి, శాంభవి ఐపిఎస్, శివాని, ఇందిరమ్మ, నాయుడమ్మల తర్వాత ఈ చిత్రం చేయనుంది. ఈమె తొలి చిత్రం కృష్ణతో కలిసి కిలాడీ కృష్ణుడుతో ఎంట్రీ ఇచ్చింది. మరలా 13 ఏళ్ల తర్వాత మహేష్‌తో రీఎంట్రీ. ఈ చిత్రం గురించి విజయశాంతి మాట్లాడుతూ, చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇది దేవుని సంకల్పమో లేదా అభిమాన ప్రేక్షకుల అభిమాన బలమో అయ్యుండాలి. ఈ అవకాశాన్ని ఓ బాధ్యతగా ఫీలవుతున్నాను. నాకు ఇప్పటికీ సినిమాల పట్ల అంకిత భావం ఉంది... అని చెప్పుకొచ్చింది.
ఇక ఈచిత్రం ఓపెనింగ్‌కి సెంటిమెంట్‌గా భావించి మహేష్ రాలేదు. ఇక ఈ చిత్రంలో అత్తారింటికి దారేది చిత్రంలో అత్త కోసం ఇండియాకు పవన్ వచ్చినట్లుగా మేజర్‌గా మిలట్రీలో చేసే మహేష్ తన స్నేహితుడికి యుద్దంలో చేసిన వాగ్దానం ప్రకారం రాయలసీమకి వచ్చి అక్కడ ఫ్యాక్షనిజాన్ని అణిచివేస్తాడనే ప్రచారం సాగుతోంది. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి లాక్ చేసి ఇలా లాక్ చేసిన మొదటి చిత్రంగా నిలిపారు.