నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలనే చేస్తానని మడికట్టుకుని కూర్చున్న సాయి పల్లవి మిడిల్ క్లాస్ అబ్బాయి ఎంసీఏ లోనే పెద్దగా ప్రాధాన్యతలేని పాత్ర చేసింది. కథ నచ్చితేనే సినిమా చేస్తానని చెప్పే సాయి పల్లవి .... శ్రీనివాస కళ్యాణం సినిమా ఒప్పుకోకుండా మంచి పని చేసిందన్నారు. ఎందుకంటే ఆ సినిమా అట్టర్ ప్లాప్. ఇక తమిళనాట సాయి పల్లవి, ధనుష్ సరసన చేసిన మారి 2 కూడా అట్టర్ ప్లాప్. ఆ సినిమాలో ధనుష్ ని ప్రేమించే అమ్మాయిగా, ధనుష్ భార్యగా సాయి పల్లవి మంచి నటన కనబర్చింది. కానీ సినిమానే ఆడలేదు. సాయి పల్లవి డాన్స్ కి, నటనకు వంక పెట్టడానికి ఎవ్వరూ సరిపోరు. అంత టాలెంటెడ్ నటి. కానీ ఈమధ్యన సాయి పల్లవి రాంగ్ స్టెప్స్ వేస్తుంది అనిపిస్తుంది. మంచి అవకాశాలు చేజార్చుకుని.. ప్లాప్ మూవీస్ ని ఒప్పుకుంటుందని అనిపిస్తుంది.
నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన సూర్య ఎన్జీకే సినిమాలో సూర్య భార్యగా సాయి పల్లవి నటించింది. అయితే సాయి పల్లవి పాత్రని దర్శకుడు సెల్వ రాఘవన్ బాగా లైట్ తీసుకున్నాడు. ఆమె పాత్రకి మరింత ప్రాధాన్యత కల్పించొచ్చు. కానీ.. సాయి పల్లవి పాత్రని చూస్తే ఇలాంటి పాత్రలకు సాయి పల్లవి ఎలా పడిపోతుంది అని అంటున్నారు. సాయి పల్లవి నటన సూపర్. బట్ ఆమె పాత్రే ఆమెని చీప్ చేసేసింది. సాయిపల్లవి రెండు మూడు సన్నివేశాల్లో తన ప్రత్యేకతను చాటుకుంది. కానీ ఆమె స్థాయికి తగ్గ పాత్ర కాదిది. అయినా చివరకి సాయి పల్లవి కూడా ప్రాధాన్యత అంటూ చివరికి ఇలాంటి పాత్రలే అడ్జెస్ట్ కావాల్సి వస్తుంది.