తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ అజిత్. ఈయన నాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న అమ్మ జయలలితకి ఎంతో ఆప్తుడు. పర్మిషన్ లేకుండా జయ పోయేసెగార్డెన్‌కి వెళ్లే ఏకైక వ్యక్తి ఆయన. ఒకానొక సందర్భంలో జయ తన వారసునిగా అజిత్‌ని ప్రకటించింది. కానీ జయ మరణం తర్వాత ఎన్నో పార్టీలు, చివరకు అన్నాడీఎంకే కూడా ఎంత బతిమాలినా రాజకీయాలకు అజిత్ నో చెప్పాడు. ఇటీవల ఎన్నికల్లో ఆయన్ను అన్నాడీఎంకే లేదా బిజెపిలో చేర్చేందుకు ఎందరో విఫలయత్నం చేశారు. కానీ అజిత్ వెంట నో అనే మాటే వచ్చింది.
ఇక ఈయన తన కెరీర్‌లో ఎప్పుడు రాజకీయ నేపధ్యం ఉన్న చిత్రం చేయలేదు. ఆయన నటించే 60వ చిత్రానికి హెచ్. వినోద్ అనే దర్శకుడు పొలిటికల్‌బ్యాక్‌డ్రాప్ ఉండే కథను తీసుకుని వస్తే వెంటనే నిర్మోహమాటంగా నో అని చెప్పిన ఆయన మరో కథకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా నటించి చాలా కాలం అయింది. దాంతో ఆయన తన 60వ చిత్రానికి పోలీస్ కథను ఒప్పుకున్నాడట.
పోలీసు వ్యవస్థలో అవినీతి, లంచాలు, లంచాలు ఇచ్చి కొందరు తాము చేసిన నేరాలను కప్పిపుచ్చుకునే స్టోరీతో ఈ చిత్రం సాగనుంది. మరోవైపు అజిత్ బాలీవుడ్ ‘పింక్’ చిత్రం కోలీవుడ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. ‘నేర్కొండ పార్వై’ పేరుతో తీస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నాడు.