Advertisementt

సంక్రాంతి రిలీజ్ లిస్ట్‌లోకి మరో భారీ సినిమా!

Fri 31st May 2019 09:58 PM
nagarjuna,bangarraju,sankranthi race,mahesh babu,rajinikanth,kamal haasan  సంక్రాంతి రిలీజ్ లిస్ట్‌లోకి మరో భారీ సినిమా!
One More Big Film in Sankranthi Race సంక్రాంతి రిలీజ్ లిస్ట్‌లోకి మరో భారీ సినిమా!
Advertisement
Ads by CJ

సినిమాలకు దసరా, సంక్రాతి పండగలు ఎంత ముఖ్యమో అనేది చూస్తూనే వున్నాం. చాలామంది దర్శకనిర్మాతలు దసరా, సంక్రాంతి టార్గెట్ గానే సినిమాలు తెరకెక్కిస్తారు. అయితే ఈ దసరా కి ఏ ఏ సినిమాలు విడుదలవుతాయి క్లారిటీ లేదు కానీ.. సంక్రాంతికి మాత్రం పెద్ద సినిమాల లైన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే అనిల్ రావిపూడి - మహేష్ మూవీ, ప్రభాస్ 20 మూవీతో పాటుగా రజినీకాంత్ దర్బార్, శంకర్ - కమల్ హాసన్ ల భారతీయుడు 2 సినిమాలు కూడా విడుదలవుతాయంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా.. ఇప్పుడు మరో పెద్ద సినిమా కూడా సంక్రాంతి లైన్ లోకొచ్చేసిందనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. 

నాగార్జున ప్రస్తుతం మన్మధుడు 2 సినిమా సెట్స్ పై ఉన్నాడు. అయితే మన్మధుడు సినిమా తర్వాత నాగార్జున, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ బంగార్రాజు సినిమా చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు ఆగష్టు నుండి సెట్స్ మీదకెళ్లబోతుందట. ఇక ఆగష్టు నుండి డిసెంబర్ కల్లా.. సినిమా పూర్తి చేసి సంక్రాంతి బరిలో దింపే యోచనలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. నాగ్ - కళ్యాణ్ కృష్ణ ల సోగ్గాడే చిన్నినాయనా సంక్రాంతికే విడుదలై బిగ్గెస్ట్ హిట్ అవడంతో.. ఈసారి కూడా బంగార్రాజుని సంక్రాంతి బరిలో దింపాలనే యోచనలో ఉన్నారట. మరి రజిని, ప్రభాస్, మహేష్, కమల్ హాసన్ లను తట్టుకుని బంగార్రాజు ఎలా నిలుస్తుందో చూద్దాం. అయితే ఫైనల్ గా ఎన్ని సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయో చూడాలి.

One More Big Film in Sankranthi Race:

Nagarjuna Bangarraju in Sankranthi Race

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ