నిఖిల్ ముద్ర అలియాస్ అర్జున్ సురవరం సినిమా విడుదల డేట్ పై ఒక కాంటెస్ట్ రన్ చేస్తే అది ఎంతగా హైలెట్ అయ్యేదో చెప్పలేం. మరి నిఖిల్ - లావణ్య జంటగా నటించిన అర్జున్ సురవరం సినిమా విడుదలకు ముహూర్తమే దొరకడం లేదు. ఏప్రిల్ లో పలు డేట్స్ మార్చుకుని చివరికి మే లో అయినా సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే అర్జున్ సురవరం సినిమా ఊసే మీడియాలో వినబడడం లేదు. ఆ మధ్యన అర్జున్ సురవరం ప్రమోషన్స్ ని నిఖిల్ వెరైటీగా మొదలు పెట్టినా... ప్రస్తుతం అయితే అర్జున్ సురవరం మాట ఎక్కడా వినబడడం లేదు.
నిఖిల్ కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తా అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాడు కానీ.. అర్జున్ సురవరం మాట మాత్రం ఎత్తడం లేదు. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకుంది. ఆమెకి ఈ సినిమా హిట్ అవ్వడం కీలకం. కానీ అర్జున్ సురవరం అసలు విడుదలవుతుందా అనే సందేహం ఇప్పుడు కలుగుతుంది. ఎందుకంటే వేసవి సెలవలన్నీ పూర్తయ్యి.. స్కూల్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయి. ఇక నిఖిల్ అర్జున్ సురవరానికి ఇంతకన్నా మంచి టైం దొరకదు. కానీ అర్జున్ సురవరం పై నిఖిల్ తోపాటు నిర్మాతలకు నమ్మకం లేదేమో అందుకే ఆ సినిమా ప్రమోషన్స్ తో పాటుగా విడుదల తేదీని అటకెక్కించారు.