Advertisementt

నూతన దర్శకుడితో సుమంత్ మూవీ!

Fri 31st May 2019 02:59 PM
hero sumanth,new movie,new director,confirmed  నూతన దర్శకుడితో సుమంత్ మూవీ!
Sumanth New Movie Confirmed నూతన దర్శకుడితో సుమంత్ మూవీ!
Advertisement
Ads by CJ

నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి ప్రముఖ కథానాయకుడు సుమంత్ తో ఓ భారీ చిత్రం మొదలు పెడుతున్నారు.

యువ ప్రతిభాశాలి సంతోష్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ యాక్షన్ డ్రామాను సంజన ప్రొడక్షన్స్-సాయి కృష్ణా ప్రొడక్షన్స్ పతాకలపై పి.జగన్ మోహన్ రావు-డి.ఎస్.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమంత్ సరసన సిమ్రత్ నటించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది. సుమంత్ ను కొత్త కోణంలో, సరికొత్త గెటప్ తో చూపించే ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, సినిమాటోగ్రఫీ: అష్కర్.

‘‘ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డ కాదు. ఎవరూ మంచి కాదు. పరిస్థితుల ప్రభావంతోనే మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారతారు’’ అనే సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం రూపొందనుందని దర్శకుడు సంతోష్ కుమార్ తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని సంజన ప్రొడక్షన్స్ అధినేత పి.జగన్ మోహన్ రావు అన్నారు.

Sumanth New Movie Confirmed:

Sumanth New Movie With New Director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ