Advertisementt

బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చేశాడు..!

Thu 30th May 2019 07:21 PM
bandla ganesh,clarity,pawan kalyan,boyapati srinu,new movie  బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చేశాడు..!
Bandla Ganesh Clarity on movie with Pawan Kalyan బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చేశాడు..!
Advertisement
Ads by CJ

నిన్న సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో రాజకీయాల్లో ఫెయిల్ అయిన.. పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేసుకుంటాడని ప్రచారంతో పాటుగా.. ముందు అడ్వాన్స్ తీసుకున్న నిర్మాతలను కాదని... కమెడియన్, నిర్మాత అయిన బండ్ల గణేష్ నిర్మాతగా బోయపాటి దర్శకత్వంలో ఒక మాస్ ఎంటర్ టైనర్ చెయ్యబోతున్నాడంటూ వార్తలు ప్రచారంలోకొచ్చాయి. ఇక ఈ సినిమా చేసినందుకు గాను పవన్ కళ్యాణ్ కి పరమ భక్తుడైన బండ్ల గణేష్ 40 కోట్ల పారితోషకాన్ని ఇస్తున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది.

అయితే ఆ వార్తలు బండ్ల వరకు చేరే సరికి బండ్ల వెంటనే... పవన్ తో తాను సినిమా నిర్మిస్తానని వస్తున్న వార్తలపై ఓ ట్వీట్ వేసాడు. ఆ ట్వీట్ లో పవన్ తో నేను సినిమా చేస్తున్నాను అన్నది నిజం కాదని స్పష్టం చేశారు. తన బ్యానర్ లో ఏ సినిమా కూడా ఇంతవరకూ ఫైనలైజ్ కాలేదని చెప్పిన బండ్ల గణేష్... ఏదైనా సినిమా ఉంటే మొట్టమొదట అనౌన్స్ చేసేది తానేనని చెప్పుకొచ్చాడు. మరి దీన్నిబట్టి బండ్ల - పవన్ - బోయపాటి కాంబో సినిమా అనేది అంతా ట్రాషే.

Bandla Ganesh Clarity on movie with Pawan Kalyan:

Bandla Ganesh about Movie with Pawan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ