Advertisementt

బాలయ్య షాకింగ్ డెసిషన్..!!

Thu 30th May 2019 05:32 PM
balakrishna,ks ravikumar,postponed,balayya,ysrcp,ys jagan  బాలయ్య షాకింగ్ డెసిషన్..!!
Balakrishna Takes Shocking Decision బాలయ్య షాకింగ్ డెసిషన్..!!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ‘కథానాయకుడు, మహానాయకుడు’ దెబ్బకి సినిమాలు మొదలుపెట్టే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. అలాగే 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమితో బాలయ్య ప్రస్తుతం బయట కనిపించడం లేదు. బాలయ్య మరోమారు హిందూపూర్ నుండి ఎమ్యెల్యేగా ఎన్నికైనా టిడిపి ఘోర పరాజయం బాలయ్యని ఇబ్బంది పెట్టే విషయమే. ఇక ఎన్టీఆర్ బయోపిక్ హిట్ అయితే బోయపాటితో సినిమా చేసేవాడే. కానీ ఆ సినిమాలు ప్లాపవ్వడంతో బోయపాటితో చేయాల్సిన సినిమాను బాలయ్య క్యాన్సిల్ చేసాడనే న్యూస్ ప్రచారంలో ఉంది. అందుకే జై సింహ డైరెక్టర్ రవికుమార్ తో మరో సినిమా అనౌన్స్ చేసాడు బాలయ్య. సి కళ్యాణ్ నిర్మాతగా రేపో మాపో పట్టాలెక్కబోతుందని ప్రచారం జరుగుతున్న ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయినట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బాలయ్య - కె ఎస్ రవికుమార్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా విషయంలో సోషల్ అండ్ వెబ్ మీడియాలో చాలా రకాల న్యూస్ లు ప్రచారంలో కొచ్చాయి. ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడని... అలాగే లెజెండ్ తో విలనవతారమెత్తిన జగపతి బాబు ఈ సినిమాలో విలన్ గా డ్యూయెల్ రోల్ చేయబోతున్నాడనే న్యూస్ నడిచింది. తాజాగా బాలయ్య - రవికుమార్ కాంబో మూవీ కొన్ని కారణాలతో ఆగిపోయింది. కారణం ఏపీ లో ప్రస్తుతం సీఎం గా ప్రమాణ శ్వీకారం చెయ్యబోతున్న జగన్ కు బాలయ్య -  రవికుమార్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా కథకు కాస్త దగ్గర పోలికలు ఉన్నాయట. మరి జగన్ వైసిపి గెలవకపోతే ఆ సినిమా పట్టాలెక్కేది. కానీ జగన్ గెలవడం, సీఎం గా ప్రమాణ శ్వీకారం చెయ్యడానికి రెడీ అవడంతో.. ఇప్పుడు గనక ఇలాంటి కథతో సినిమా చేస్తే బాగోదనే ఉద్దేశ్యంతోనే ఆ సినిమా ఆగినట్లుగా ఫిలింనగర్ టాక్. కథ మార్చాలంటే చాలా తతంగం కాబట్టే సినిమానే ఆపేసినట్లుగా వార్తలొస్తున్నాయి.

Balakrishna Takes Shocking Decision :

Balakrishna and KS Ravikumar Movie postponed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ