Advertisementt

ఎఫ్ 2 ఎఫెక్ట్: 50 నుంచి ఒకేసారి 80కి..!!

Wed 29th May 2019 09:33 PM
mehrene kaur,f2 movie,ira creations,gopichand,naga shourya,mehrene kaur salary  ఎఫ్ 2 ఎఫెక్ట్: 50 నుంచి ఒకేసారి 80కి..!!
Heroine Mehrene Kaur Salary Hiked ఎఫ్ 2 ఎఫెక్ట్: 50 నుంచి ఒకేసారి 80కి..!!
Advertisement
Ads by CJ

రవితేజ, నాని వంటి హీరోల సరసన నటించి హిట్ సినిమాలు చేసిన మెహ్రీన్ కౌర్ కి మాత్రం యంగ్ అండ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించడం అనేది కలగానే మిగిలిపోయేలా కనబడుతుంది. ఈ ఏడాది అనుకోకుండా బిగ్గెస్ట్ హిట్ అయిన ఎఫ్ 2 సినిమాలో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ ఫేట్ మారుతుంది అనుకున్నారు అంతా. అలాగే అవకాశాలు క్యూ కడతాయన్నారు. ఓ అన్నంత అవకాశాలు లేకపోయినా... గోపీచంద్ సరసన ఒక సినిమా, నాగశౌర్య సరసన ఐరా క్రియేషన్స్ లో మరో సినిమాలో మెహ్రీన్ నటిస్తుంది.

అయితే నాగశౌర్య సరసన ఐరా క్రియేషన్స్ లో ముందుగా ఛలో హీరోయిన్ రష్మిక మందన్నని ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం టాప్ లెవల్లో దూసుకుపోతున్న రష్మిక డేట్స్ ఖాళీ లేక చెయ్యనందో... రెమ్యూనరేషన్ సరిపోక నో చెప్పిందో తెలియదు కానీ.... రష్మిక ప్లేస్ లోకి మెహ్రీన్ వచ్చి చేరింది. అయితే ఇప్పటివరకు రెమ్యూనరేషన్ కింద 50 లక్షలు మాత్రమే అందుకుంటున్న మెహ్రీన్ ఈ ఐరా క్రియేషన్స్ లో నాగశౌర్య సరసన నటిస్తునందుకు గాను అక్షరాలా 80 లక్షలు అందుకుంటుంది. మరి ఈ రెమ్యూనరేషన్ పెరుగుదలకు కారణం ఎఫ్ 2 హిట్ కావొచ్చు.

Heroine Mehrene Kaur Salary Hiked :

F2 Effect: Mehrene Kaur Remuneration Hiked

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ