Advertisementt

శర్వా, నిర్మాతల మధ్య ‘రణరంగం’ అందుకేనా?

Wed 29th May 2019 09:02 PM
sharwanand,upset,producer,ranarangam  శర్వా, నిర్మాతల మధ్య ‘రణరంగం’ అందుకేనా?
War between Ranarangam Hero and Producer శర్వా, నిర్మాతల మధ్య ‘రణరంగం’ అందుకేనా?
Advertisement
Ads by CJ

‘ర‌ణ‌రంగం’..ఈ టైటిల్‌తో శర్వానంద్ మన ముందుకు వస్తున్నాడు. సుధీర్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఆగస్టులో ఈమూవీ రిలీజ్ కానుంది. నిజానికి ఈ వేసవిలో రిలీజ్ కావాలి కానీ షూటింగ్ లేట్ అవ్వడం వల్ల సినిమా రిలీజ్ డేట్ ఆల‌స్య‌మైంది.

అయితే ఈమూవీ షూటింగ్ లేట్ అవ్వడానికి, షూటింగ్ స‌జావుగా జర‌క్క‌పోవ‌డానికి శ‌ర్వానే కార‌ణ‌మ‌ని నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ కాస్త గుర్రుగా ఉన్నాడ‌ట‌. ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’, ‘ర‌ణ‌రంగం’ షూటింగులు రెండూ స‌మాంత‌రంగా సాగాయి. అయితే ముందుగా ప‌డి ప‌డి లేచె మ‌న‌సు రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో  శ‌ర్వా నిరాశ‌కు లోన‌య్యాడ‌ని, అందుకే త‌ర‌చూ ‘ర‌ణ‌రంగం’ షూటింగ్‌కి డుమ్మా కొట్టేవాడ‌ని తెలుస్తోంది. 

ఆ మూవీ ఫ్లాప్‌ అవ్వడంతో శ‌ర్వా మూడ్ అప్ సెట్ అవ్వ‌డం వ‌ల్ల చాలాసార్లు రణరంగం షూటింగ్ పేకప్ చెప్పాల్సివచ్చిందని... అందుకే బడ్జెట్ కూడా అనుకోకుండా పెరిగిపోయిందని.. దాంతో శర్వా తీరుతో నిర్మాత అప్ సెట్ అయ్యాడ‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా నిర్మాత, హీరోల మధ్య సరిగా మాటలు లేవని టాక్ నడుస్తుంది. 

War between Ranarangam Hero and Producer:

Producer Upset with Sharwanand behaviour

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ