Advertisementt

తేజూకి మరో ప్లాప్ హీరోయిన్ బుక్కయింది!

Wed 29th May 2019 08:04 PM
sai dharam tej,malavika sharma,nela ticket,maruthi  తేజూకి మరో ప్లాప్ హీరోయిన్ బుక్కయింది!
Malavika Sharma in Teju and Maruthi film తేజూకి మరో ప్లాప్ హీరోయిన్ బుక్కయింది!
Advertisement
Ads by CJ

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ చిత్రలహరితో హిట్టిచ్చానని అనిపించుకున్నాడు కానీ ఇతనితో నటించేందుకు స్టార్ హీరోయిన్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదు. మారుతీ డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ ఓ సినిమా చేయనున్నాడు. ఈక్రమంలో తేజుకి జోడిగా స్టార్ హీరోయిన్స్ ని తీసుకుందాం అనుకున్న మారుతీ ప్రయత్నాలు ఏమి ఫలించలేదు. 

చాలామంది బిజీ హీరోయిన్స్ ని సంప్రదించిన టీమ్.. లాస్ట్‌కి ‘నేల టిక్కెట్’తో పరిచయం అయిన మాళవికా శర్మని ఓకే చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో కూడా సినిమాలు ఏమీ లేవు. అందుకే వచ్చిందే ఛాన్స్ అని ఓకే చెప్పేసింది. తేజు గత చిత్రం చిత్రలహరి టైములో కూడా ఈ సమస్యే ఎదురుకున్నాడు. అప్పుడు కూడా ఇతనికి స్టార్ హీరోయిన్స్ దొరకలేదు. దాంతో కళ్యాణి ప్రియదర్శన్‌, నివేతా పేతురాజ్‌ని తీసుకున్నారు.

ఇప్పుడు మరోసారి ఆ సెంటిమెంట్‌ కలిసి వచ్చి మాళవికతో కూడా హిట్టు కొడతాడేమో చూడాలి. ఇక ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌తో పాటు యువి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Malavika Sharma in Teju and Maruthi film:

One more flop heroine for Sai dharam tej

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ