Advertisementt

మంత్రి తలసానిని కలిసిన ఎఫ్.సి.ఏ

Wed 29th May 2019 04:16 PM
film critic association,fca,talasani srinivas yadav,suresh kondeti  మంత్రి తలసానిని కలిసిన ఎఫ్.సి.ఏ
FCA team meets Talasani Srinivas Yadav మంత్రి తలసానిని కలిసిన ఎఫ్.సి.ఏ
Advertisement
Ads by CJ

కొత్తగా ఎన్నికైన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ టీమ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను మంగళవారంనాడు సెక్రటేరియట్‌లోని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసింది. అసోసియేషన్‌ అధ్యక్షుడు సురేష్‌కొండేటి, ప్రధాన కార్యదర్శి ఇ. జనార్దనరెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీకి మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అధ్యక్షుడు సురేష్‌ కొండేటి అసోసియేషన్‌పరంగా వున్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. 

దానికి స్పందించిన మంత్రి.... క్రిటిక్‌ అసోసియేషన్‌ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందనీ, సభ్యులకు ప్రభుత్వపరంగా అందాల్సిన సౌకర్యాలను తప్పకుండా అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఫించన్‌, మెడిక్లెయిమ్‌, షాదీముబాకర్‌, కళ్యాణలక్ష్మీ వంటివి అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తూ... అసోసియేషన్‌ అభివృద్ధిపథంలో నడవాలంటే నిధిసేకరణ ముఖ్యమనీ, ఆ దిశగా ఇండస్ట్రీలోని ముఖ్యుల ద్వారా నెరవేర్చుకోవాలని సూచించారు. అనంతరం నూతన కార్యవర్గం బాధ్యతలు నిర్వహించేరోజున తాను తప్పకుండా హాజరవుతానని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కమిటీ ఆయనకు ధన్యవాదాలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్టు, మాజీ క్రిటిక్‌ ప్రెసిడెంట్‌ ప్రభు, ఉపాధ్యక్షులు డి.జి. భవాని, సజ్జా వాసు, కోశాధికారి ఎం.ఎన్‌. భూషణ్‌, కార్యవర్గ సభ్యుడు మురళీ (శక్తిమాన్‌) తదితరులు పాల్గొన్నారు.

FCA team meets Talasani Srinivas Yadav:

Talasani Srinivas Yadav supports to FCA