నేచురల్‌స్టార్ నానికి కమర్షియల్‌గా కంటే నటునిగా పీక్స్‌ని రుచి చూపించిన చిత్రం ‘జెర్సీ’. ఈ చిత్రంలో ఆయన నటన చూసి ఫిదా కాని ప్రేక్షకుడే లేడు. ఈ చిత్రం మంచి లాభాలను కూడా అందించింది. ఈ జోష్‌లో ఉన్న నాని ‘దేవదాస్, కృష్ణార్జునయుద్దం’ నాటి తప్పులను మరలా రిపీట్ చేయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘గ్యాంగ్‌లీడర్’ టైటిల్‌పరంగా అందరినీ మరీ ముఖ్యంగా మెగాఫ్యాన్స్‌ని ఆకర్షిస్తోంది. ఇందులో లేడీ దొంగల గ్యాంగ్‌కి నాని లీడర్‌గా హాస్యం అందించబోతున్నాడని సమాచారం.
ఇక దిల్‌రాజు బేనర్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబు నటిస్తున్న ‘వి’ చిత్రంతో ఈయన కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడట. ఇందులో ఆయన పాత్ర కర్ణుడి తరహాలో ‘జెంటిల్‌మేన్’లోని అర్జున్, ‘ఠాగూర్’లోని చిరంజీవి, ‘టెంపర్’లోని ఎన్టీఆర్‌ల తరహాలో ఉంటుందని ‘వి’ అనే టైటిల్ కూడా నానిని సూచించే టైటిలే అని తెలుస్తోంది. చేసే పనులు తప్పుగా ఉన్నా లక్ష్యం మంచిదిగా సాగే పాత్ర ఇదట. దీని తర్వాత నాని చేయబోయే చిత్రాలు ఏమిటి? అనే ఆసక్తి కనిపిస్తోంది. పరుశురాం ఆల్‌రెడీ మహేష్‌కి స్టోరీలైన్ చెప్పాడని వార్తలు వస్తున్నాయి. మహేష్ నో అంటే పరుశురాంతో నాని చిత్రం గీతాఆర్ట్స్2లో ఉండనుంది. గతంలో నానికి బ్లాక్‌బస్టర్ అందించిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం కూడా ఇదే బేనర్‌లో రూపొందింది. అలాగే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బేనర్‌లో కూడా నాని కోసం ఓ కథను సిద్దం చేస్తున్నారని సమాచారం.
ఇక స్టార్‌రైటర్‌గా గుర్తింపు తెచ్చుకుని తన మొదటి చిత్రమే అల్లుఅర్జున్‌తో ‘నాపేరు సూర్య...నా ఇల్లు ఇండియా’ తీసిన దర్శకుడు వక్కంతం వంశీ కూడా నాని కోసం ఎదురుచూపులు చూస్తున్నాడట. ‘నాపేరు సూర్య...నా ఇల్లు ఇండియా’ డిజాస్టర్ కావడంతో వక్కంతం వంశీకి మరో చాన్స్ రాలేదు. తాజాగా ఆయన నానికి ఓ స్టోరీ వినిపించాడట. ఈ మూవీ ఓకే అయితే చాలా గ్యాప్ తీసుకున్న బ్లాక్‌బస్టర్ బండ్లగణేష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా పలు ఆఫర్లు నాని కోసం ఎదురుచూస్తున్నా ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది.