Advertisementt

యాక్షన్ మూడ్‌లో ‘డిస్కోరాజా’

Wed 29th May 2019 12:50 PM
ravi teja,disco raja,latest,update  యాక్షన్ మూడ్‌లో ‘డిస్కోరాజా’
Disco Raja in Action Mood యాక్షన్ మూడ్‌లో ‘డిస్కోరాజా’
Advertisement
Ads by CJ

యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో రవితేజ, వి ఐ ఆనంద్, ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్మెంట్స్ ‘డిస్కోరాజా’ 

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్ర‌స్తుతం హైదరాబాద్ లో జ‌రుగుతుంది. ఈ షెడ్యూల్ లో హీరో రవితేజతో ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. హైద‌రాబాద్ అల్యూమినీయం ఫ్యాక్ట‌రీలో భారీగా వేసిన‌ సెట్ లో ప్ర‌స్తుతం హీరో, విలన్ మ‌ధ్య పోరాట స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ‌ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. 

న‌టీన‌టులు 

ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ్‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌, సునీల్, రామ్‌కి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం 

బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత : రామ్ త‌ళ్లూరి

ద‌ర్శ‌కుడు : విఐ ఆనంద్

సినిమాటోగ్రాఫ‌ర్  :  కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని

డైలాగ్స్ : అబ్బూరి రవి

మ్యూజిక్ : థ‌మన్

ఎడిట‌ర్ : న‌వీన్ నూలి

పీఆర్ఓ : ఏలూరు శ్రీను

Disco Raja in Action Mood:

Ravi Teja Disco Raja Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ