Advertisementt

చిరు కోసమే ఒప్పుకుందట..!

Tue 28th May 2019 09:17 PM
anushka,special song,chiranjeevi,ram charan,sye raa narasimha reddy  చిరు కోసమే ఒప్పుకుందట..!
Anushka in Chiranjeevi Sye Raa చిరు కోసమే ఒప్పుకుందట..!
Advertisement
Ads by CJ

స్వీటీ అనుష్కకి తెలుగులో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, హీరోలతో సంబంధం లేకుండా లేడీఓరియంటెడ్‌ చిత్రాలను కూడా ఆ స్థాయిలో కమర్షియల్‌ హిట్స్‌గా నిలపడంలో నేటితరంలో ఆమె తర్వాతే ఎవరైనా...? పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో నాగార్జున, సోనూసూద్‌ కలిసి నటించిన ‘సూపర్‌’ చిత్రం ద్వారా ఈ చిన్నది టాలీవుడ్‌లో వెండితెరకు పరిచయమైంది. మొదటి చాన్స్‌ ఇచ్చిన నాగార్జునతో ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఆయన నటించిన పలు చిత్రాలలో హీరోయిన్‌గానే కాదు.. మరికొన్నింటిలో అతిధిపాత్రలు కూడా చేసింది. ఇక ‘బాహుబలి’తో దేశవ్యాప్త గుర్తింపు సాధించింది. ఇక ఈమెకి ఇండస్ట్రీలో ఉన్న మరో సన్నిహితుడు ప్రభాస్‌, ఆయన కోరిక మేరకు ఆమె ‘సాహో’ చిత్రంలో కూడా క్యామియో పాత్ర చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇక అనుష్క గతంలో మెగాస్టార్‌ నటించిన ‘స్టాలిన్‌’ చిత్రంలో ఆయనతో కలసి ఓ పాటలో చిందులేసింది.

ఇక విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా తన కుమారుడి హోం బేనర్‌ కొణిదెల ప్రొడక్షన్స్‌లో 150కోట్లకు పైగా బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా ‘సై..రా..నరసింహారెడ్డి’ చేస్తున్నాడు. దీనికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. ఇక ఒక్కపాటే బ్యాలెన్స్‌ ఉన్నట్లు సమాచారం. ఈ పాట కోసం హైదరాబాద్‌లోని స్టూడియోలో భారీ సెట్‌ వేస్తున్నారు. మొదటి నుంచి ఈ పాట చిరు, తమన్నాల మధ్య ఉంటుందనే ప్రచారం సాగింది. అయితే ఈ పాటలో స్వీటీ కూడా చిరుతో ఆడిపాడనుందని తెలుస్తోంది. 

ఈ పాటకు మాత్రమే అనుష్క పరిమితమని, అంతకు మించి ఆమెకి చిత్రంలో పాత్ర, సన్నివేశాలు వంటివి ఉండవని అంటున్నారు. అనుష్క రాక వల్ల ఈ సినిమాకి మరింత ప్లస్‌ అవుతుందనే చెప్పాలి. అందునా ఒకే తెరపై నయనతార, తమన్నా, అనుష్క అంటే అంతకుమించి అభిమానులకు కావాల్సింది ఏముంది....? 

Anushka in Chiranjeevi Sye Raa :

Anushka Special Song in Sye Raa Narasimha Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ