Advertisementt

పవన్‌ ఫ్యాన్స్‌ ఏం ఆశిస్తున్నారు?

Tue 28th May 2019 06:18 PM
pawan kalyan,pawan kalyan fans,politics,janasena,hero,movies  పవన్‌ ఫ్యాన్స్‌ ఏం ఆశిస్తున్నారు?
What is the Pawan Kalyan’s Next Step? పవన్‌ ఫ్యాన్స్‌ ఏం ఆశిస్తున్నారు?
Advertisement

మన ప్రజలకు షార్ట్‌మెమరీ ఎక్కువ అంటే కొందరికీ కోపం వస్తుందేమో గానీ ఇది నిజం. దాదాపు మనమందరం ‘గజిని’ల టైపే. కానీ అలా అని ఒప్పుకోవడానికి మాత్రం మన మనసు ఒప్పుకోదు. ఇక ఎన్నికలు ముగిశాయి. వైసీపీ ఘనవిజయం సాధించింది. దీనికి ఘనవిజయం కంటే పెద్ద పదం ఏమైనా వాడాల్సివుంటుంది. జగన్‌ ముఖ్యమంత్రి కావాలని, ఆయనకు ఒక్క చాన్స్‌ ఇవ్వాలని ఇచ్చాపురం నుంచి హిందుపురం వరకు అందరు భావించడం వల్లనే అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా గట్టి పోటీ ఖాయం అనే మాటలను అబద్దం చేస్తూ, ఏపీలో హంగ్‌కి చోటేలేదని ఓటర్లు తీర్పు ఇచ్చారు. ఇక ఇది తెలుగుదేశం పార్టీ స్వయంకృతాపరాధమేనని చెప్పాలి. కానీ అదే సమయంలో పవన్‌ జనసేన గురించి మాత్రం కాస్త సానుభూతి వ్యక్తం అవుతోంది. కనీసం పవన్‌ స్వయంగా గెలిచినా అంతగా బాధుండేది కాదు. కానీ ఆయన పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాలలో ఓడిపోవడం, ఆయన పట్టుబట్టి మరీ నరసాపురం ఎంపీ సీటు ఇచ్చిన మెగాబ్రదర్‌ నాగబాబు ఘోరపరాజయం పాలవ్వడంతో పాటు ఎవ్వరూ ఊహించని విధంగా రాజోల్‌ అభ్యర్ది గెలవడం చూస్తే విధి అంటే ఇలాగే ఉంటుందా? అనిపించకమానదు. 

అయినా పవన్‌ సరికొత్త రాజకీయాలంటూ చేసిన ప్రయత్నం మాత్రం గొప్పది. ఇక పవన్‌ ఓటమిని చూసి సంతోషపడే వారెవ్వరైనా ఉన్నారంటే వారు పవన్‌తో సినిమాలు తీయాలని ఆశిస్తున్నవారేనని చెప్పాలి. మైత్రిమూవీమేకర్స్‌తో పాటు ఎ.యం.రత్నం వంటి వారు పవన్‌తో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. కానీ పవన్‌ మాత్రం ఓటమి పెద్దగా బాధించలేదు. మనం ఒక లక్ష్యంతో వచ్చాం. మనం ప్రజలవైపే ఉండాలని అని చెప్పడం ఆయన గొప్పతనమే. ఇక ఈ ఐదేళ్లు ఆయన మరలా ప్రజాసమస్యలు, ప్రతిపక్షంగా ఎప్పుడు నీరసంగా ఉండే చంద్రబాబు టిడిపిని మించి ఎంతవరకు వాటిపై పోరాడుతాడు? జగన్‌ని ఎలా ఎదుర్కొంటాడు? అనేది చూడాలి. బహుశా మరోసారి చంద్రబాబు వయసు రీత్యా సీఎం కాకపోవచ్చు. చంద్రబాబు లేని టిడిపిని నిలబెట్టడం బాలయ్య, లోకేష్‌ల వల్ల అయ్యే పని కాదు. ఏమైనా జూనియర్‌ ఎన్టీఆర్‌ పగ్గాలు అందుకోవాలనే వాదన వినిపిస్తోంది. 

నిజానికి దీనిని ఐదేళ్ల పాటు ప్రజాక్షేత్రంలో ఉండి ఎదుర్కొంటే జగన్‌కి, పవన్‌కి మద్యే తదుపరి ఎన్నికల్లో పోటీ ఉంటుంది. అయినా పూర్తిగా ఇలా ప్రజాసమస్యలకే కాకుండా రాజకీయాలలో చురుకుగానే ఉంటూ రజనీ, కమల్‌లాగా తనను తాను నాయకునిగా ప్రొజెక్ట్‌ చేసుకునేలా మంచి సినిమాలను, ప్రజాసమస్యలపై చిత్రాలను చేస్తే వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు అది ఆదాయవనరుగా మాత్రమే కాదు.. పలు విధాలుగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. మరి ఈ విషయంలో పవన్‌ ఫ్యాన్స్‌ ఆలోచనలు ఎలా ఉన్నాయో వేచిచూడాల్సివుంది. 

What is the Pawan Kalyan’s Next Step?:

Pawan Kalyan Fans What wants..?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement