మహేష్ ‘మహర్షి’ సినిమా ఎంత హిట్ అని డబ్బాలు కొట్టినా.. ఒక్క నైజాం తప్ప ‘మహర్షి’కి లాభాలొచ్చిన ఏరియా ఒక్కటి లేదు. మూడు వారలు ఎలాంటి పోటీ లేకపోయినా.. ‘మహర్షి’ సినిమా మాత్రం ఓ అన్నంత హిట్టవలేదు. దిల్ రాజు, వంశి పైడిపల్లి, మహేష్ బాబు మాత్రం ‘మహర్షి’ సూపర్ డూపర్ హిట్ అంటూ బయ్యర్లకు నష్టాలూ రాకూడదని.. వస్తే ఎక్కడ తాము భరించాల్సి వస్తుందో అని తమ సినిమా హిట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ముందు నుంచి ‘మహర్షి’ సినిమా ఓవర్సీస్ మార్కెట్ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడినట్లే... తాజాగా అక్కడ మహర్షి సినిమా హిట్ అవలేక.. డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన పెట్టుబడి తేలేక ముక్కుతోంది!
అయితే.. దిల్ రాజు రహస్య ఒప్పందంతో ‘మహర్షి’ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాల్లో సగం తాము భరించేలా డీల్ చేసాడట దిల్ రాజు. అందుకే అక్కడ మూడు వారాల్లో మహర్షికి రెండు కోట్ల నష్టం కనబడుతుంది. మరి ఇంకా లాంగ్ రన్ లో 10వేల డాలర్లు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ‘మహర్షి’ 2 మిలియన్ మార్క్ మాత్రం టచ్ చేయదు. ఇక రెండు కోట్ల నష్టం మాత్రం ఓవర్సీస్ బయ్యర్లకు తప్పేలా లేదు. అందుకే దిల్ రాజు మహర్షి ఓవర్సీస్ నష్టాల్లో ఓ కోటి భరిస్తాడట. ఎందుకంటే లాభాలొస్తే... సగం వాటా. నష్టం వచ్చిన సగం వాటా మీదే మహర్షి ఓవర్సీస్ హమ్ములు దిల్ రాజు అప్పట్లో అమ్మాడట.