పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన వ్యక్తి చింతకింది మల్లేశం బయోపిక్ ‘మల్లేశం’ రూపొందుతుంది. బయోపిక్‌లో ప్రియదర్శి మల్లేశం పాత్రలో నటిస్తున్నారు. రాజ్.ఆర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జూన్ 21న విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది.
ఝాన్సీ, అనన్య సహాయక పాత్రల్లో నటించారు. మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాలు శాండిల్యస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమా ట్రైలర్, పాటలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు:
ప‌్రియదర్శి
ఝాన్సీ
అనన్య
చక్రపాణి
తాగుబోతు రమేష్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: రాజ్.ఆర్
నిర్మాతలు: రాజ్.ఆర్, శ్రీఅధికారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్ధారెడ్డి
మ్యూజిక్: మార్క్ కె.రాబిన్
సినిమాటోగ్రఫీ: బాలు శాండిల్యస,
ప్రొడక్షన్ డిజైన్: నితిన్ లుకాసొ
డైలాగ్స్: పెద్దింటి అశోక్ కుమార్
పాటలు: గొరేటి ఎంకన్న, చంద్రబోస్, దాశరథి
సౌండ్ డిజైన్: నితిన్ లుకాసొ
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్
క్రియేటివ్ కనల్లెంట్, ఎడిటర్: శ‌్రీనివాస్
డైరెక్టర్ ఆఫ్ యాక్టింగ్: మహేష్ గంగిమల్ల
ఎడిటింగ్: రాఘవేంద్ర.వి
కలరిస్ట్: శ్రీనివాస్ మామిడి