జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం‘సువర్ణసుందరి’. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలొ ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. హీరో ఇంద్ర పుట్టిన రోజును పురస్కరించుకొని కేక్ ను కట్ చేయించి విషేష్ ను తెలియ చేసారు.
హీరొ ఇంద్ర మాట్లాడుతూ.. అందరం కష్టపడ్డాం.. ఈ టీమ్ తో మరో సినిమా చెయాలనుంది. దర్శక నిర్మాతల కష్టానికి తగ్గ ప్రతిఫలం బావుండాలని కొరుకుంటున్నానన్నారు.
హీరో రామ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం విషయంలో దర్శకుడు సూర్య హార్డ్ వర్క్ హైలెట్ గా చెప్పుకొవాలి.ఆద్యంతం గ్రిప్పింగ్ గా సినిమాను తెర మీదకు తీసుకు వచ్చారన్నారు.
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. ఈ సినిమాకు అందరం చాలా ఎక్కువ హార్ట్వర్క్ చెశాము. తెరపై అది కన్పిస్తుందన్నారు.
హీరొయిన్ సాక్షి మాట్లాడుతూ.. సువర్ణ సుందరి నాకెరీర్ లొ ప్రత్యేక చిత్రం . గ్లామర్, యాక్షన్, లవ్ ,థ్రిల్ ఇలా అన్నీ అంశాలు హైలెట్ గా దర్శకుడు సూర్య సినిమా తీసారన్నారు.
నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ.. సువర్ణ సుందరి ఈ నెల 31వ తేదీన తెలుగు, కన్నడలో విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బడ్జెట్ ను మించి క్వాలిటి ఔట్ పుట్ రావటం సినిమా సక్సెస్ పై కాన్పిడెన్స్ ను పెంచిందన్నారు.
దర్శకుడు ఎం.ఎస్.ఎన్. సూర్య మాట్లాడుతూ.. సువర్ణ సుందరి టెక్నిషియన్స్ సినిమా. కథ డిమాండ్ కు తగ్గట్టుగా క్వాలిటీ తో సినిమాను చేశాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. ఇందులో ప్రతి పాత్ర కీలకమైనదే.రెండెసి గెటప్స్ లొ కన్పిస్తారు. 45 ని. గ్రాఫిక్స్ , సిజీ వర్క్ ఉండటం వల్ల విడుదలకు సమయం తీసుకున్నాము. నిర్మాత సపొర్ట్ తో మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామన్నారు.
సాయి కార్తీక్ మాట్లాడుతూ.. దర్శకుడు సూర్య టేకింగ్ కు , నటీనటుల కష్టం సువర్ణ సుందరికి ప్రధాన బలం, టెక్నికల్ గా ది బెస్ట్ వర్క్ ను అందరు చూస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సాయి కార్తీక్, రామ్ సుంకర, ఎలుమహంతి తదితరులు పాల్గొన్నారు
జయప్రద, పూర్ణ, సాక్షి, ఇంద్ర, రామ్, సాయికుమార్, కోటాశ్రీనివాసరావు, ముక్తర్‌ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్ నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ఃఎం.ఎల్.లక్ష్మి, మ్యూజిక్‌డైరెక్టర్ఃసాయికార్తిక్, స్టంట్స్ఃరామ్‌సుంకర, ఆర్ట్ డైరెక్టర్ఃనాగు, డి.ఓ.పి. ఎల్లుమహంతి, ఎడిటర్ఃప్రవీణ్‌పూడి, స్టోరీఃఎం.ఎస్.ఎన్.సూర్య, పి.ఆర్.ఓ. సాయిసతీష్, డైరెక్టర్ఃఎం.ఎస్.ఎన్.సూర్య.