చాలా గ్యాప్ తీసుకుని బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఫామిలీ ఎంటెర్‌టైనర్ చేస్తున్నాడు. ఆల్రెడీ షూట్ ప్రారంభమై, రెండు ఫైట్లు తీసి గ్యాప్ ఇచ్చారు. ఈమూవీని హారిక హాసిని, గీతా కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఫినిషింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులు నుండి సినిమా షూటింగ్‌కి గ్యాప్ వచ్చిందని.. త్రివిక్రమ్- బన్నీకి సరిగా పడట్లేదని ఏవేవో పుకార్లు ఫిల్మ్‌నగర్‌లో గుప్పుమన్నాయి.
అయితే ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ.. ఈ నెల 29 నుంచి ఓ లెంగ్తీ షెడ్యూలుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 29న ప్రారంభించి వచ్చేనెల 26 దాటే వరకు అంటే దాదాపు 30 రోజుల షెడ్యూలును కేవలం హైదరాబాద్ పరిసరాల్లోనే ప్లాన్ చేస్తున్నారు. దీంతో ముప్పై శాతం షూటింగ్ అయిపోతుందని చెబుతున్నారు.
ఈ షెడ్యూల్‌లో దాదాపు కీలక నటులంతా పాల్గొంటారు. హైదరాబాద్ లో లోకేషన్ల రెక్కీ ఫినిష్ చేసారు. బన్నీ సరసన మరోసారి పూజా నటిస్తున్న ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.