తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ‘లక్ష్మి కళ్యాణం’ సినిమా చేసింది. ఆ సినిమాతో కాజల్ హీరోయిన్‌గా కాస్త హైలెట్ అయ్యింది. లక్ష్మి కళ్యాణం ప్లాప్ అయినా... కాజల్ నటనకు పేరొచ్చింది. తరవాత టాప్ హీరోయిన్‌గా మారాక తన మొదటి దర్శకుడు తేజ అడిగాడని ‘నేనే రాజు నేనే మంత్రి సినిమా’లో రానా కి జోడిగా నటించింది. ఆసినిమా హిట్. మళ్ళీ తనకి బాగా నచ్చిన సీత కథతో తేజ దర్శకత్వంలో సినిమా చేసింది. నేనె రాజు నేనె మంత్రి సినిమాలో కాజల్ నటన, గ్లామర్ కి ఎంతగా పేరొచ్చిందో తెలిసిందే. ఇక సీత లో కూడా కాజల్ పాత్రే హైలెట్. సీత లో టైటిల్ రోల్ కాజల్ దే. అందుకే ఆ సినిమా ఒప్పుకుంది. సీత సినిమాలో సీత కేరెక్టర్ లో సీత నటన అద్భుతమే. కాజల్ అగర్వాల్ నటన సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు.
తన అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే కాజల్ ఈసారి తన నటనతో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న సీత పాత్రకు కాజల్ అగర్వాల్ బాగానే సూటైంది. కాజల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. కాజల్ గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అయింది. మరి సీత సినిమా మెయిన్ ప్లస్ పాయింట్ కాజల్. కానీ తేజ డైరెక్షన్ లో పస లేదు. హీరో బెల్లంకొండ తేలిపోవడం, కథ, కతకథనంలో లోపాలతో సీత సినిమా మాత్రం ప్రేక్షకులకు అంతగా ఎక్కదు. పాపం కాజల్ అందాలు, గ్లామర్, నటన కూడా సీత ని కాపాడలేదనేది ఈ వీకెండ్ లో తెలిసిపోతుంది.