మెగా ఫ్యామిలీ ట్యాగ్... తలపండిన నిర్మాత.. తెలుగు ప్రొడ్యూసర్స్‌లో అతి మేధావిగా పేరున్న అల్లు అరవింద్ గారాల ముద్దుల చిన్నబ్బాయ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడిగా లెగసీ ఉన్న హీరో అల్లు శిరీష్. ‘గౌరవం’తో మొదలుపెట్టి వరసగా ఫ్లాప్ల్‌లను ఇస్తూనే ఉన్నాడు. ‘కొత్తజంట’తో పాటు అన్ని చిత్రాలు బోల్తా కొట్టాయి. ఉన్నంతలో పరుశురాం పుణ్యమా అని ‘శ్రీరస్తు.. శుభమస్తు’ ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత అయినా గాడిలో పడతాడనుకుంటే ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వి.ఐ. ఆనంద్ ‘ఒక్క క్షణం’ కూడా ఆయన్ను కాపాడలేకపోయింది. దాంతో పాటు తన తండ్రి రికమండేషన్, మల్లూవుడ్లో అల్లు అర్జున్కి ఉన్న ఫాలోయింగ్ అయినా ఆయన్ను కాపాడతాయని మోహన్ లాల్ సినిమాలో చాన్స్ ఇప్పించానా ఫలితం లేదు.
చివరకు మలయాళంలో యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్కి మంచి విజయం తెచ్చిపెట్టిన ‘ఎబిసిడి’ని రీమేక్ చేశాడు. ఈ రీమేక్ మూవీ కూడా దర్శకుని వైఫల్యం వల్ల ఫలితం లేకుండా పోతోంది. నిజానికి పరభాషలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని కనీసం యావరేజ్ గా కూడా మలచడంలో డైరెక్టర్ తప్పే కనిపిస్తోంది. అల్లు శిరీష్ అండ్ టీమ్ మాత్రం ఇది తన కెరీర్లో పెద్ద హిట్గా చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ మూవీ వేసవి సమయంలో విడుదల కావడంతో కాస్తంత ఓపెనింగ్స్ వచ్చాయి. అంతే తప్ప సినిమా మాత్రం ఏ వర్గాన్ని ఆకట్టుకోలేకపోతోంది.
హైదరాబాద్ మినహా అన్ని చోట్లా డెఫిషిట్‌తో రన్ అవుతోందని అంటున్నారు. మరోవైపు ఈ చిత్రం ప్రమోషన్లలో కనీసం అల్లు అరవింద్, మెగా ఫ్యామిలీ మౌనమే వహిస్తోంది. ఈ చిత్రం అల్లు ఫ్యామిలీకి పెద్ద గుణపాఠమేనని చెప్పాలి. ఇక ఈ శుక్రవారం ఐదారు చిత్రాలు విడుదల అవ్వడంతో ‘ఎబిసిడి’ మూవీ ఫైనల్ రన్‌ని ముగించుకుందనే చెప్పాలి.