దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ తీశారు. అయితే ఈయన గత కొంత కాలం నుండి భక్తిరస చిత్రాలు మాత్రమే తీసుకుంటూ వస్తున్నారు. అతని గత చిత్రం ఓం నమో వెంకటేశాయ...ఫెయిల్ అయింది. ఇక ఇప్పుడు అందుకే ఓ కొత్త ఆలోచనతో ముందు వస్తున్నారు.
ముగ్గురు దర్శకులు, ముగ్గురు కథానాయికలతో ఓ సినిమా రూపొందించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీని కె.రాఘవేంద్రరావుతో పాటు బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఆ ముగ్గురు దర్శకులు కేవలం నటనకు మాత్రమే పరిమితం అవుతారు. ఈ ముగ్గురు దర్శకులని మరో దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడు అని తెలుస్తుంది. అలానే ఈ ముగ్గురు దర్శకులకి ముగ్గురు కథానాయికలు కూడా ఉన్నారట.
మరి ఆ ముగ్గురు దర్శకులు, ఆ ముగ్గురు కథానాయికలు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అసలు దీన్ని రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే దర్శకుడితో డైరెక్ట్ చేయిస్తాడా? అన్నది తెలియాల్సిఉంది. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.