Advertisementt

ఈ హాట్ బ్యూటీస్.. బిగ్‌బాస్ 3లో..!

Thu 23rd May 2019 03:01 PM
srimukhi,jwala gutta,udayabhanu,bigg boss 3,nagarjuna,host  ఈ హాట్ బ్యూటీస్.. బిగ్‌బాస్ 3లో..!
Hot Beauties in Bigg Boss season 3 ఈ హాట్ బ్యూటీస్.. బిగ్‌బాస్ 3లో..!
Advertisement
Ads by CJ

తెలుగు ప్రేక్షకులకి మొన్నటివరకు ఐపీల్ సీజన్ నడిస్తే మరికొన్ని రోజుల్లో క్రికెట్ వరల్డ్ కప్ జరగనుంది. అలానే బిగ్‌బాస్‌ సీజన్ 3 కూడా స్టార్ట్ అవ్వనుంది. దాంతో మనోళ్లంతా ఫుల్ బిజీ కానున్నారు. అయితే మొదటి సీజన్ తో పోల్చుకుంటే రెండో సీజన్ లో విజేత ఎవరో మూడు వారాలకే తెలిసిపోవడంతో ఈసారి అలా విజేత ఎవరనేది ఊహించలేని విధంగా గేమ్‌ని ప్లాన్‌ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వహాకులు.

ఈసారి మసాలా డోస్ కూడా పెంచాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఈసారి సెక్సీ బామ్మల్ని తీసుకోనున్నారు. ఈ లిస్ట్ లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగు పెడుతుందట. అలానే సినిమా వాళ్లతో తరచుగా కనిపించే బ్యాడ్మింటన్‌ తార జ్వాలా గుత్తా కూడా బిగ్‌బాస్‌ షోలో పార్టిసిపేట్ చేయనుందని తెలుస్తుంది. రీసెంట్ గా ఆమెకు బిగ్ బాస్ టీం నుండి ఫోన్ కాల్ వెళ్లిందట.

వీరిద్దరికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈసారి ఎక్కువ మందిని పెళ్లి కానీ వాళ్లనే తీసుకోవాలని అనుకుంటున్నారు. తద్వారా హౌస్‌లో లవ్‌స్టోరీస్‌ నడిపించడానికి ఎక్కువ ఆస్కారముంటుందని భావిస్తున్నారట. ఈసారి పెద్ద సెలెబ్రెటీస్ నే తీసుకుని రానున్నారు. పైగా ఈసారి నాగార్జున ఈ షోని హోస్ట్ చేయనున్నాడు. అందుకే ఆయన ఆంక్ష విధించడంతో కాస్త ఖర్చయినా అందరూ పేరున్న వాళ్లనే తీసుకొస్తున్నారట. మరో యాంకర్ ఉదయభాను పేరు కూడా ఈ లిస్ట్ లో ఉంది కానీ ఆమె ఎక్కువ రెమ్యూనరేషన్ అడగడంతో ఆమెను హోల్డ్ లో పెట్టారు.

Hot Beauties in Bigg Boss season 3:

Srimukhi, Jwala Gutta and Udayabhanu names for Bigg Boss 3

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ