Advertisementt

‘పోలీస్‌ పటాస్‌’గా.. ‘జనగణమన’

Thu 23rd May 2019 02:30 PM
janaganamana,police patas,movie,release,june  ‘పోలీస్‌ పటాస్‌’గా.. ‘జనగణమన’
Janaganamana Turns Police Patas ‘పోలీస్‌ పటాస్‌’గా.. ‘జనగణమన’
Advertisement
Ads by CJ

అయేషా హబీబ్‌, రవి కాలే, కురి రంగా కీలక పాత్రధారులు కన్నడంలో రూపొందిన ‘జనగణమన’ చిత్రం ‘పోలీస్‌ పటాస్‌’ టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. శశికాంత్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పారిశ్రామిక వేత్త టి.జి.వెంకటేశ్‌ విడుదల చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘రామసత్యనారాయణ కమిట్‌మెంట్‌ ఉన్న నిర్మాత అని విన్నాను. ఫస్ట్‌ లుక్‌, ట్రైలర్‌ చూశాక సినిమాల పట్ల ఆయనకున్న అభిరుచి తెలిసింది. అదే అభిరుచితో 97 సినిమాలు తీశారు. కన్నడంలో హిట్‌ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధించాలి. ఈ ఏడాదిలోనే వందో సినిమా కూడా ఆయన నిర్మించాలి’’ అని అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘‘నిర్మాతగా నాకు 97వ సినిమా ఇది. మంచి కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడంలో చక్కని విజయం అందుకుంది. కథానాయిక అయేషా తిరుపతి అమ్మాయి. సూపర్‌ టాలెంట్‌ ఉన్న అమ్మాయి. త్వరలో తెలుగు స్ట్రెయిట్‌ సినిమాలో యాక్ట్‌ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

Janaganamana Turns Police Patas:

Police Patas Movie Release on June

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ