ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు.. దక్షిణాదిలోని అన్ని భాషల్లో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న టాలీవుడ్ సంచలనం విజయ్‌దేవరకొండ. ఈయన ఎలాంటి ఫిల్మ్‌బ్యాగ్రౌండ్ లేకుండా అతి తక్కువ చిత్రాలతోనే స్టార్‌స్టేటస్ పొందాడు. ఇక కోలీవుడ్‌లో, బాలీవుడ్‌లో ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌లు రూపొందుతున్నాయి. దాంతో ఆయా భాషా సినీ ప్రేమికులు, ఇండస్ట్రీ ముఖ్యులు విజయ్‌పై ఓ కన్ను వేసి ఉన్నారు. ఇక ఈయన ఎంచుకునే సినీ టైటిల్స్, వాటిని ప్రమోట్ చేసే తీరు.. ఎన్ని విమర్శలు వచ్చినా తనదైన యాటిట్యూడ్‌తో సంచలనంగా మారడం ఎలా? అనే విషయంలో ఈయన పీహెచ్‌డీ చేశాడనే చెప్పాలి. ‘పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతాగోవిందం, నోటా’ వంటి ఆయన చిత్రాల టైటిల్స్ ఆయనకు మంచి ప్లస్‌గా మారుతున్నాయి.
ఇక ఈయన భరత్‌కమ్మ దర్శకత్వంలో రష్మికా మందన్నతో మరోసారి జోడీ కడుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’ ఈ చిత్రం టైటిల్ కూడా బాగా క్యాచీగానే ఉంది. ఈ మూవీని జులై26న విడుదల చేయనున్నారు. మరోవైపు విజయ్ ‘ఓనమాలు, మళ్లీమళ్లీ ఇది రాని రోజు’ వంటి ఫీల్‌గుడ్ డైరెక్టర్ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె.యస్.రామారావు బేనర్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఆయన సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తూ ఉండటం విశేషం. రాశిఖన్నా, ఐశ్వర్యరాజేష్, విదేశీ మోడల్ ఇజబెల్‌లీట్‌లు ఆయన సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం మొత్తం ఒక అమ్మాయిని ప్రేమించడం, అనుకోని కారణాల వల్ల బ్రేకప్‌లు అవుతూ ఉండటం అనే పాయింట్ మీద రూపొందుతోంది. ఇలాంటి బ్రేకప్‌లను క్రాంతిమాధవ్ మంచి ఫీల్‌గుడ్‌తోనే చూపించగల సత్తా ఉంది.
దాంతో ఈ మూవీ కోసం యూత్‌కి క్యాచీగా ఉండేలా ‘బ్రేకప్’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. ఈ టైటిల్ విజయ్‌కి పర్‌ఫెక్ట్ యాప్ట్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో హీరో ఓ హీరోయిన్‌తో హాలీవుడ్ రేంజ్‌ని మించేలా రెండు నిమిషాల లిప్‌లాక్‌ని చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఒక హీరోయిన్‌తో ఆ లిప్‌లాక్‌లను సరిపుచ్చుతాడా? బాలీవుడ్ ఇమ్రాన్‌హష్మిలా ముగ్గురు భామలతో ఘాటు రొమాన్స్‌చేస్తాడా? అనేవి వేచిచూడాల్సివుంది....! ఇక తాజాగా ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించే మల్టీలింగ్వల్ ఫిల్మ్ ‘హీరో’ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో విజయ్ వెరైటీగా బైక్ రైసర్ పాత్రను పోషిస్తూ ఉండటం విశేషం.