సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సెషనల్ మూవీ ‘మహర్షి’ రికార్డ్స్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇది మహేష్ బాబుకు 25వ చిత్రం. తన ల్యాండ్ మార్క్ చిత్రాన్ని అత్యద్భుత విజయం కావడంతో.. దీనిని డైరెక్టర్ చేసిన వంశీ పైడిపల్లికి మరో సినిమా డైరెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు మహేష్ బాబు.
ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌కి వెళ్లారు. తిరిగి రాగానే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈసినిమాను వచ్చే ఏడాది అంటే 2020 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తరువాత మహేష్.. వెంటనే పరశురామ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళాలి కానీ మహేష్ మనసు మార్చుకున్నాడని సమాచారం.
పరశురామ్ సినిమాకంటే ముందు వంశీ పైడిపల్లితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట. అనిల్ సినిమా త్వరగా కంప్లీట్ చేసి వంశీ సినిమాను 2020 వేసవిలో పట్టాలెక్కిస్తారు. మరి అప్పటి వరకు పరశురామ్ ఖాళీగానే కూర్చోవాలా? లేదా ఈ గ్యాప్‌లో వేరే హీరో తో ఓ సినిమా చేసి వస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.