సీత మూవీ ప్రమోషన్స్‌లో కాజల్ అగర్వాల్ కేవలం సీత గురించి మాత్రమే కాదు.. ఇంకా చాలా విషయాలు మీడియాతో పంచుకుంది. సీత సినిమా కోసం తానెంత శ్రమించానో చెబుతున్న కాజల్ ని మీడియా మిత్రులు కాజల్ నటించబోయే భారతీయుడు 2 సినిమా విషయాలు అడగగా.. దానికి కాజల్ అగర్వాల్ కూడా తాను కూడా ఆ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్నానని... భారతీయుడు 2 ఆగిపోయింది అని జరిగే ప్రచారంలో నిజం లేదని చెబుతుంది. భాతీయుడు 2 సినిమా ఖచ్చితంగా ఉంటుందని చెబుతుంది కాజల్.
కమల్ హాసన్ వలన భారతీయుడు 2 షూటింగ్ ఆగిపోయింది, నిర్మాతలు వలన సినిమా షూటింగ్ కి బ్రేక్ వచ్చింది అనే దానిలో నిజం లేదని.... కమల్ సర్ రాజకీయాలలో బిజీగా ఉండడం వలనే భారతీయుడు 2 సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారని.. మళ్ళీ జూన్ నుండి భారతీయుడు 2 సెట్స్ మీదకెళుతుందని.. ఎప్పుడెప్పుడు భారతీయుడు 2 షూటింగ్ లో పాల్గొంటానా అనే క్యూరియాసిటీతో ఉన్నానని చెబుతుంది. మరి నిజంగానే కాజల్ అగర్వాల్ చెప్పినట్లుగా భారతీయుడు 2 మళ్ళీ మొదలైతే అటు శంకర్ ఇటు నిర్మాతలు అలాగే కమల్ హాసన్ అభిమానులు అందరూ ఆల్ హ్యాపీస్.