Advertisementt

‘అభినేత్రి 2’ విడుదలకు డేట్ లాక్ చేశారు

Tue 21st May 2019 11:33 AM
abhinetri 2 release date,abhinetri 2,tamanna,prabhudev,vijay,nanditha swetha  ‘అభినేత్రి 2’ విడుదలకు డేట్ లాక్ చేశారు
Abhinetri 2 Release Date locked ‘అభినేత్రి 2’ విడుదలకు డేట్ లాక్ చేశారు
Advertisement
Ads by CJ

మే 31న ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, నందితా శ్వేత కీలక పాత్ర‌ల్లో న‌టించిన ‘అభినేత్రి 2’ విడుద‌ల‌ 

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన ‘అభినేత్రి’ తెలుగులో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ‘అభినేత్రి 2’ మే 31న విడుద‌లవుతుంది. ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, నందితా శ్వేత, స‌ప్త‌గిరి, సోనూసూద్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. విజ‌య్ ద‌ర్శ‌కుడు. అభిషేక్ నామా, ఆర్‌. ర‌వీంద్ర‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాట్లాడుతూ.. ‘‘అభినేత్రి సినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు సీక్వెల్‌గా వ‌స్తున్న ‘అభినేత్రి 2’ మే 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రినీ అల‌రిస్తుంది. థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే, మ‌న‌సుకు న‌చ్చే ఆహ్లాద‌క‌రమైన స‌న్నివేశాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌భుదేవా, త‌మ‌న్నా, నందితా శ్వేత పెర్ఫార్మెన్స్‌లు హైలైట్ అవుతాయి. శామ్ సంగీతం అంద‌రినీ త‌ప్ప‌క అల‌రిస్తుంది. ఆయంక బోస్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ప్ల‌స్ అవుతుంది. మే 31న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం’’ అని చెప్పారు. 

ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: ఆయంక బోస్‌, సంగీతం: శామ్ సి.ఎస్‌., ఎడిటింగ్‌: ఆంటోని.

Abhinetri 2 Release Date locked:

Abhinetri 2 Release on May 31st

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ