Advertisementt

‘సువ‌ర్ణ‌సుంద‌రి’ ఆలస్యానికి కారణం ఇదే!

Tue 21st May 2019 12:19 AM
suvarna sundari,release date,poorna,sakshmi chowdary,jayapradha,suvarna sundari movie  ‘సువ‌ర్ణ‌సుంద‌రి’ ఆలస్యానికి కారణం ఇదే!
Suvarna Sundari Ready to Release ‘సువ‌ర్ణ‌సుంద‌రి’ ఆలస్యానికి కారణం ఇదే!
Advertisement
Ads by CJ

జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘‘సువర్ణసుందరి’’. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న క్యాప్షన్‌తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఓ సాంకేతిక అద్భుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే‌ విడుదలైన థియేట్రిక‌ల్‌ ట్రైలర్‌కు మిలియన్ వ్యూస్ లభించాయి.

ఈ సందర్బంగా కెమెరామెన్ ఈశ్వ‌ర్ మాట్లాడుతూ.. ఈ 31కి సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. కొంచం లేట‌యినా మంచి అవుట్‌పుట్‌తో వ‌స్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ఇప్పుడు విడుద‌ల‌వ‌డం క‌రెక్ట్ టైమ్‌. అంద‌రూ ఈ సినిమాని చూసి త‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ప్రొడ్యూస‌ర్ ల‌క్ష్మీ మాట్లాడుతూ.. మా సినిమాకి మొద‌టి నుంచి కూడా మీడియా చాలా స‌పోర్ట్ చేసింది. మీ స‌పోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్నాను. ఈ నెల 31వ తేదీన తెలుగు, క‌న్న‌డ‌లో విడుద‌ల‌వుతుంది. గ‌తంలో విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈరోజు(సోమవారం) విడుద‌లైన మ‌రో ట్రైల‌ర్‌ని కూడా అదే విధంగా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మేము అనుకున్న బ‌డ్జెట్ కంటే ఎక్కువ‌గానే ఖర్చు అయింది. అయినా అవుట్ పుట్ చాలాబాగా వ‌చ్చింది. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాము.. అన్నారు.

డైరెక్ట‌ర్ ఎం.ఎస్.ఎన్‌. సూర్య మాట్లాడుతూ.. ఒక డైరెక్ట‌ర్‌గా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆల్రెడీ రిలీజ్ చేసిన మా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మొదట్లో అంద‌రూ న‌న్ను ప్రొడ్యూస‌ర్‌తో కాస్త ఎక్కువ ఖ‌ర్చుపెట్టించావ్ అన్నారు. కానీ స్టోరీ అలా డిమాండ్ చేసింది. అరుంధ‌తి, మ‌గ‌ధీర టైప్‌లో ఉంటుంది. ఈ మూవీలో కామెడీ లేదు ఎవ్వ‌రూ కామెడీని ఎక్స్‌పెక్ట్ చేయవద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ రోజు విడుద‌లైన మ‌రో ట్రైల‌ర్‌ను కూడా ఇంత‌కు ముందులానే ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను. స్టోరీ లైన్ వ‌చ్చేసి ఆరువంద‌ల సంవ‌త్స‌రాల క్రితం ఒక‌రాజు చేసిన త‌ప్పిదం వ‌ల్ల త‌ర‌త‌రాల వాళ్ళ‌ను వెంటాడే క‌థ ఇది. ఇందులో జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి అంద‌రి పాత్రలు కీల‌క‌మైన‌వే.. అని అన్నారు.

ఫైట్‌మాస్ట‌ర్ రామ్ సుంక‌ర మాట్లాడుతూ.. మ‌రో కొత్త ట్రైల‌ర్‌తో ట్రెండీగా, మాసివ్‌గా మిమ్మ‌ల్ని ఆక‌ట్టుకుంటుంది. ఇంత లేట్ అవ‌డానికి కార‌ణం క్వాలిటీ కోసం వెయిట్ చేశాం. మీకు సినిమా చూస్తే అర్ధ‌మ‌వుతుంది. ఇన్నిరోజులు వెయిట్ చేసినందుకు అర్ధ‌ముందని అనిపిస్తుంది. మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

Suvarna Sundari Ready to Release:

Suvarna Sundari Release on May 31st

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ