మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. చివరి దశలో ఉన్న ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారట. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర తరువాత మరో పాత్రకి కూడా ప్రత్యేకమైన గుర్తింపు వస్తోందట.
ఆ పాత్ర ఎవరో కాదు తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఇందులో విజయ్ కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లో గూఢచారి ఛాయలు ఉన్న లుక్ లో కనిపించనున్నాడు. రీసెంట్ గా విజయ్ లుక్ ని కూడా రివీల్ చేసారు మేకర్స్. ఇక సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ హీరో సుదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
హీరోయిన్ గా నయనతార నటిస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలనీ నిర్మాత రామ్ చరణ్ డిసైడ్ అయ్యారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు.