మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ నిర్మాతలు పోస్టర్స్ మీద పోస్టర్స్ విడుదల చెయ్యడమే కాదు... నా లైఫ్ లో ఇలాంటి హిట్ ఇంతవరకు అందుకోలేదు అన్నట్టుగా మహేష్ బాబు బిహేవియర్ ఉంది. ఎప్పుడూ ప్రమోషన్స్ కి దూరంగా ఉంటే మహేష్ బాబు మహర్షి కోసం కాలేజ్ ల చుట్టూ, స్కూల్స్ చుట్టూ, సక్సెస్ మీట్స్, విజయోత్సవాలు అంటూ హంగామా చేస్తున్నాడు. మరి మహేష్ బాబు కోరుకున్న హిట్ ఇదేనా అనే డౌట్ ప్రతి ఒక్క నిమిషం మహర్షి విషయంలో వస్తూనే ఉంది. నైజాం లాంటి ప్రాంతాల్లో మహర్షి కలెక్షన్స్ అదుర్స్ అన్న రేంజ్ లో ఉన్నా.... సీడెడ్, ఓవర్సీస్ లో మహర్షికి అంత సీన్ లేదంటున్నారు. మరో పక్క చాలా ఏరియాలలో మహర్షికి బ్రేక్ ఈవెన్ రావడం కూడా కష్టమంటున్నారు.
మొదటి వారం గడిచి రెండో వారంలో రెండో వీకెండ్ ముగుస్తుంది కానీ ఇంతవరకు ఏ ఏరియాలోను మహర్షి బ్రేక్ ఈవెన్ కి చేరుకోలేదు. ఎప్పటిలాగే మహేష్ మహర్షి సినిమాకి ఓ లెవెల్లో బయ్యర్లు థియేటర్స్ హక్కులు కొన్నారు. భరత్ అనే నేను అప్పుడు కూడా సినిమా హిట్ అని ప్రచారం చేసినా... చాలా చోట్ల బయ్యర్లు నష్టాల పాలయ్యారు. ఆ విషయాన్నీ బయటికి రాకుండా నిర్మాతలు తొక్కిపట్టేసారు కాని ఈసారి అలా అయ్యేలా లేదు. నైజాంలో మహర్షి సేఫ్ అందులో డౌట్ లేదు.
కానీ సీడెడ్, ఓవర్సీస్ లో మాత్రం అక్కడో ఐదు అక్కడో ఐదు కోట్ల నష్టాలు మాత్రం బయ్యర్లు భరించాల్సిందే. అయితే బయ్యర్లు తమ మీదకి రాకుండా తమ సినిమా హిట్ అంటూ నిర్మాతలతో పాటు మహేష్, డైరెక్టర్ వంశి పైడిపల్లి కూడా తమవంతుగా తమ సినిమాకు డబ్బా కొడుతూనే ఉన్నారు. మహేష్ అయితే మరీను కాలర్ ఎగరేసి మరీ మహర్షి గురించి మాట్లాడుతున్నాడు. మరి మహర్షి ప్లాప్ అంటే మహేష్ మాత్రం ఒప్పుకునేలా కనిపించడం లేదు. ఈవారం కూడా గడిస్తే మహర్షి సీన్ ఏంటో తేలిపోతుంది అని అంటున్నారు.