కేన్స్ చిత్రోత్సవాల్లో తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్
తెలంగాణ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు ఆకర్షించడానికి, తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అత్యున్నత సాంకేతికతను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పుస్కూరు రామ్‌మోహన్‌రావు ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవాల్లో విదేశీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.
కేన్స్ చిత్రోత్సవాలకు తెలంగాణ చిత్ర పరిశ్రమ తరపున హాజరైన ఆయన అక్కడికి విచ్చేసిన దేశ, విదేశీ ప్రతినిధులతో తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్దికి అవసరమైన పెట్టుబడులు, సాంకేతికతతో పాటు తెలంగాణలో స్టూడియోలు నిర్మించడానికి, యానిమేషన్, వీడియో గేమింగ్ విభాగాలను విస్తరించడానికి వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా హిందుజా గ్రూప్ బ్రదర్స్‌తో తెలంగాణలో ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో స్టూడియోల నిర్మాణానికి ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని రామ్‌మోహన్‌రావు ఆహ్వానించారు. ఈ కేన్స్ చిత్స్రోతవాల్లో డీజీక్విస్ట్ ఛైర్మన్ బసిరెడ్డి, ఐటిపీవో ప్రెసిడెంట్ అసిఫ్ ఇక్భాల్ పాల్గొన్నారు.