క్రేజీ హీరో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొలైగారన్’. దియా మూవీస్ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్–టి.శ్రీధర్ ‘కిల్లర్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో అషిమా కథానాయికగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ తొలి వారంలో సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని రేపు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు..ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా సినిమాపై అంచనాలను పెంచింది.. టీజర్ ని బట్టి విజయ్ ఆంటోని.. యాక్షన్ కింగ్ అర్జున్ పోటాపోటీగా నటించే చిత్రం అని తెలుస్తోంది. సైమన్.కె.కింగ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి మాక్స్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్
సాంకేతిక నిపుణులు :
కథ & దర్శకుడు: ఆండ్రూ లూయిస్
నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్
బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్
సంగీతం: సైమన్ కే కింగ్
సాహిత్యం మరియు సంభాషణలు: భాష్యశ్రీ
సినిమాటోగ్రఫీ: మాక్స్
ఎడిటర్: రిచర్డ్ కెవిన్
ఆర్ట్ : వినోద్ రాజ్ కుమార్
పి.ఆర్.ఓ: సాయి సతీష్