విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై లాంఛనంగా ప్రారంభమైన ‘హీరో’
విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం ‘హీరో’ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఆనంద్ అన్నామలై ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ హీరో హీరోయిన్‌లపై క్లాప్ కొట్టారు. అలాగే దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందించారు. ఎమ్మెల్యే రవికుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మ్యూజికల్ థ్రిల్లర్ జోనర్‌లో ‘హీరో’ సినిమా తెరకెక్కనుంది. విజయ్ దేవరకొండ తొలిసారి ఇలాంటి డిఫరెంట్ జోనర్ మూవీలో నటిస్తున్నారు.
పేట్ట ఫేమ్ మాళవికా మోహనన్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. ప్రదీప్‌కుమార్ సంగీతం అందించబోయే ఈ చిత్రానికి మురళి గోవింద రాజులు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
విజయ్ దేవరకొండ
మాళవికా మోహనన్
దిగంత్ మచాలే
వెన్నెల కిషోర్
శరణ్ శక్తి
రాజా కృష్ణమూర్తి(కిట్టి)
జాన్ ఎడతట్టిల్
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: ఆనంద్ అన్నామలై
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్
సి.ఇ.ఒ: చెర్రీ
మ్యూజిక్: ప‌్రదీప్ కుమార్
సినిమాటోగ్రఫీ: మురళి గోవిందరాజులు
ఎడిటర్: ఆనంద్ అన్నామలై
ప్రొడక్షన్ డిజైనర్: మౌనికా, రామకృష్ణ
స్టంట్స్: శంకర్ ఉయ్యాల
వి.ఎఫ్.ఎక్స్: యుగంధర్
ఆపరేటివ్ కెమెరామెన్: ప‌్రదీప్
రేస్ కన్సల్టెంట్: రజనీ కృష్ణన్
సౌండ్ డిజైన్: అంథోని బి. జయరూబన్
కాస్ట్యూమ్ డిజైనర్: ఇన్‌ఫాంటినా ఫ్లోరా, హర్మన్ కౌర్
ప్రొడక్షన్ కంట్రోలర్: సుబ్రమణ్యం కె.వి.వి
పబ్లిసిటీ డిజైన్: అనీల్ భాను
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్